"లింగోద్భవాన్ని నేను సంకల్పించినప్పుడు, అది మెత్తని, ఎటుపడితే అటు సులభంగా వంగే పదార్థముతో పుడుతుంది. అది నాకడుపులో పుట్టి నోటి చివరకు వచ్చేవరకు మెత్తగా ఉంటుంది. నోటి నుండి బయటకు వెలువడేటప్పుడు మాత్రమే గట్టి పడుతుంది."
ఈ రోజున (1971వ సంవత్సరములో జరిగిన శివరాత్రి) స్వామి తన శరీరమునుండి ఆత్మలింగాన్ని ఎందుకు వెలికితీస్తారు? భగవతత్త్వాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టమని నేను మీకు చెపుతున్నాను.దాని యొక్క శక్తిని మీరు కొలిచి చెప్పలేరు. అలాగే దాని మహిమను కూడా మీరు గ్రహింపలేరు: ఆది అగమ్యము, అగోచరమూ ఐన తత్త్వము, అందువలన ఆ దివ్య తత్త్వమును మీరుతెలుసుకోవాలంటే దానికి కొన్ని నిదర్శనాలు మీకు కావాలి. మామధ్యనున్న ఆ దివ్యతత్త్వాన్ని మీరు గుర్తించేందుకు, దానివలన మీరు లాభము పొందేందుకు, అనుగ్రహము సంపాదించేందుకు ఈ విధముగా లింగము వెలువడుచున్నది."
(దై.పు.147)
"సృష్టి అంతా ఎందులో నుంచి ఆవిర్భవిస్తున్నదో, మరలాఈ సృష్టి అంతా ఎందులో లయిస్తుందో అటువంటిదీ అంతము లేనిదే లింగము"
(స.శి.సు.నా.పు.45)
అన్ని నామాలకు అన్ని రూపాలకు సంకేతమే లింగము. రూపము లేని రూపము, పేరు లేని పేరు. దైవం నుండి ప్రాథమికంగా ఆవిష్కరింపబడినదే ఈ లింగము"
(స.శి.సునా 58/59)
సృష్టి స్థితి లయములకు కారణమైన ఈ విశ్వమంతటిని తన గర్భంలో దాచుకున్న బ్రహ్మాండమే ఈ లింగము. ఈ లింగము సృష్టిని లయాన్ని కూడా సూచిస్తుంది. ఈ లింగోద్భవ దృశ్య పారవశ్యాన్ని మీ మనస్సులలో పదిలపరచుకోండి. మీ హృదయాలలో ఉప్పొంగుతున్న ఆనందాన్ని పెంచుకోండి. మీరందరూ శాశ్వతమైన అమరత్వం పొందుతారన్న హామీని మీకు నేను ఇస్తున్నాను. మీరిక జననమరణ బాధల నుండి విముక్తి పొందుతారు.
(స.శి.సు.నా.పు.46)
"బ్రహ్మము నుండి ఉద్భవించే లింగం మొదట ఒక కోరికగా కలిగి, తరువాత ఆలోచనగా మారి చివరకు సంకల్పంగా రూపొందింది. బ్రహ్మాండము పరమ శివుని సంకల్ప పరిణామమే. అదే విధంగా మీరు కూడా శివుని చేత సంకల్పించబడి, శివుని చేత, శివుని నుండి సృష్టించబడిన వారే"
(స. శి.సు.నా.పు.51/52)
వేదాలలో ఉపనిషత్తులలో కపిలదేవుడు వర్ణించిన దశాంగుళ స్వరూపమైన ఆత్మలింగం ఇదే. ఈ పవిత్ర దర్శనంచేత మీజన్మ సార్ధకత చెందింది. మీకు తిరిగిజగత్తత్వ సంబంధమైన జనన మరణాలు లేవు. ఈ లింగం చుట్టుకొలత పది అంగుళాలు. దీనిలో పల జ్యోతి రూపంలో కనిపించే త్రిశూలం ప్రతి పదినిముషముల కొక సారి క్రొత్త క్రొత్త రంగులతో ప్రకాశిస్తూ ఉంటుంది.
(త పు. 94)
లింగమునకు ఎటు ముఖము, ఎటు కాలు అనేది తెలియదు. ఆద్యంతములు లేని స్వరూపానికి లింగము అన్నారు. ఆద్యంతములు లేనివాడు భగవంతుడు మాత్రమే. కరుణాస్వరూపతత్త్వమే ఈశ్వరత్వము. .
ఈనాడు శివరాత్రి మంగళకరమైన రాత్రి శివరాత్రి ఈ శివ అనేటటువంటి మంగళకరమైన తత్త్వము ఎక్కడ నుంచి వచ్చింది? తన శ్వాస నుండి వచ్చినది. అదియే సోఽహం. అదియే ఆత్మ నుండి వచ్చిన శబ్దము. దీనిని హంసగాయిత్రి అని కూడా పిలుస్తూ వచ్చారు. హం" అనగా తాను. "సా అనగా దైవము. కాబట్టి దైవాన్ని నేనే అనే అంతరార్థమును బోధిస్తున్నది. సోహం అంటూ దినమునకు 21,600 సార్లు ప్రబోధిస్తున్నది. ఇలాంటి ప్రబోధలు అనాది కాలము నుంచి భారతదేశంలో ఆచరిస్తూ వస్తున్నారు.
(శ్రీ ఏ.2002 పు. 22)
చూడండి! ఇది ఒక పెద్ద సైజు లింగము. ఇది ఐదు తులములు బరువు వుంటుంది. ప్రతి వ్యక్తిలో 5 తులముల సువర్ణరసము ఉంటుంది. దీనినే హిరణ్యగర్చుడు అన్నారు. (ది. 13-3-2002న ఉదయం గం॥ 6.00లకు ప్రశాంతి నిలయంలోని సాయి కుశ్వంత్ హాల్ లో ఈ హిరణ్యగర్భ లింగమును సృష్టించి భక్తులకు స్వామి చూపించారు). సువర్ణశక్తి చాలా ప్రధానమైనటువంటిది. ఆ సువర్ణ శక్తి ఉన్నప్పుడే తేజస్సు ప్రకాశిస్తుంది. మన దేహములో