"క్రోధము అనేది దేహాన్ని కూడను భస్మంగావిస్తుంది. క్రోధం మన మనస్సులో చేరితే దేహమంతా వేడెక్కుతుంది. రక్తము వేగముగా స్రవహిస్తుంది. నరాలు బలహీనమవుతాయి. తిరిగి ఆ శక్తిని పొందాలంటే మూడు నెలలపాటు కూర్చుని భుజించాలి. మనం చేయవలసిన సాధనలకు, కర్మలకు బలహీనత ఏర్పడుతుంది. కనుక ఈ క్రోధమునకు ప్రవేశము యివ్వకుండా చూచుకోవటం సాధకుల యొక్క ప్రధాన కర్తవ్యము.” ,-బాబా (సాలీత పు103)
తన కలిమి భంగపుచ్చును
తనకుంగల గౌరవము దగ్ధము సేయున్
తన వారల కెడసేయును
జనులకు క్రోధంబువలన సర్వము చెడున్
కోపము కల్గినవానికి
ఏ పనియు ఫలింపకుండు ఎగ్గులు కలుగున్
పాపపు పనులను చేయును
ఛీ! పొమ్మనిపించుకొనుట చేకూరు సుమీ!
(ఆధ్యాత్మిక భారతి పు152)