ఈ భౌతికమైన వన్నీ క్షణభంగురమైనవి. దీనినే శంకరులవారు చెప్పారు. “మా కురు
ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాలాస్సర్వం". ఇదంతా క్షణంలోనే పోతుంటాయి. ఈ సుఖములు, ఈ ఆనందములు, ఈ ఆహ్లాదములు ఒక్క క్షణములో కనుమరుగై పోతుంటాయి. ఇట్టి క్షణ భంగురమైన సుఖముల నిమిత్తమై మానవుడు గొప్ప విలువైన జీవితమును నాశనము చేసుకుంటున్నాడు.
(ద.య. 97 పు. 33)