జననము 25వ తేదీన జరుగలేదు. అది 24వ తేదీన అర్ధరాత్రి సమీపించుచుండగా సంభవించినది.
(ప. పు. 154)
జీసస్ తాను క్రీస్తునని తన 25వ యేట గుర్తించెను. తన 16వ యేట నుండి ఎనిమిది సంవత్సరములు భారత దేశములో, టిబెట్, ఇరాన్, రష్యాలలో పర్యటించెను. ఆతను బిక్షుకుడిగా, సన్యాసిగా భావింపబడెడివాడు. జీసస్ వద్ద ధనము ఉండేడిది కాదు. అతని తల్లిదండ్రులు కడు బీదవారు, పిన్న వయసులోనే అతనిని యధేచ్చగా వదలివేసిరి.
(ప. పు.162)