పది దినంబుల నుండి వస్తుండు వానికి
మంచి భోజనము లభించినట్లు
చెరువు బావుల నీళ్ళు కరవైన యపుడు
వరుసగా వర్షంబు కురిసినట్లు:
సంతతి లేకను చింతిల్లు వానికి
పుణ్య సుపుత్రుండు పుట్టినట్లు
కూటికి లేకను అల్లాడుచున్నట్టి
నిరుపేదకు భక్ష్యంబు దొరికినట్లు:
ధర్మనాశనమగుచున్న ధరణియందు
ప్రభవమొందెను శ్రీసాయి పర్తియందు;
ఇంతకన్నను వేరెద్ది ఎఱుక పరతు
సాధు సద్గుణ గణ్యుల సభ్యులార!
(ఆ.రాపు 428)