"ఆధునాతనమైన, అత్యున్నతమైన ఈ వైద్యాలయం పట్టణంలో కాక పల్లె ప్రాంతంలో ఎందుకు కట్టిస్తున్నారని మీరు అడుగవచ్చు. దానికి కారణం ఒక్కటే. ధనికులైన వారు ఎక్కడికైనా పోయి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి చికిత్స పొందగలరు. కావి. పేదవారెక్కడికి పోగలరు? వారి కొఱకే ఈ సంస్థ. ఇది కలకాలం ప్రజా సేవకంకితం కావాలి. పల్లె ప్రాంతాల్లో పలు వ్యాధులతో బాధ పడే వారికి సేవలందించాలి. అట్లని పట్టణ ప్రాంతీయులనుప్రక్కన పెట్టడం లేదు. పల్లె, పట్టణ అనే భేదం లేకుండా రోగులందరికీ తరతమ భేదాలు లేకుండా ఉచితంగా వ్యాధి నివారణ చేయడమే మా ముఖ్యోద్దేశ్యము".
(స.సా.నం 99 పు.340)
"ఈనాడు విద్యా, వైద్య కేంద్రాలన్నీ వ్యాపార సంస్థలైనాయి. వాటిలో బీదలకు సేవ చేసే వాటిని వేళ్ళపై లెక్క పెట్టవచ్చు. అందుకొరకు వంద కోట్లు రూపాయలు వెచ్చించి ఈ వైద్యాలయాన్ని నిర్మిస్తున్నాము. ఇక్కడ ఉన్నత విద్యేకాదు, ఉన్నత వైద్యం కూడా ఉచితమే. ఉన్న వాళ్ళు లక్షలు ఖర్చుచేసి అమెరికాలాంటి దేశాల్లో చికిత్స చేసికొంటే పేదవాళ్ళ గతేమిటి? వాళ్ళకు ఎవరు మందులిస్తారు? దీనిని దృష్టిలో పెట్టుకునే ఈ బృహత్పథకాన్ని చేపట్టినాము. గుండె ఆపరేషన్‌గాని, మూత్ర పిండముల మార్పిడి గాని, ఏదైనా అంతా ఉచితంగానే చేయబడవలెనని నిర్ణయించాము. తదనుగుణంగా 1991 నవంబరు 22వ తేదీన ఈ వైద్యాలయం ప్రారంభింపబడుతుంది."
(స.సా. న.99పు.340)
(చూ: సంగీత విశ్వవిద్యాలయము)