(శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్)
"మానవ జాతి యొక్క మనుగడకు ప్రధాన లక్ష్యము ఆత్మానందమును పొందుట, మానవులందరూ కలసిమెలసి ప్రేమతో జీవించుట. ఈ విద్యా సంస్థలో బోధించే ఉన్నత విద్య ఇదియే. ఈ విశ్వ విద్యాలయములో చదువుకునే విద్యార్థులకు ఆత్మసైర్యమును, ఆత్మ విశ్వాసమును పెంపొందించి తమ కాళ్ళపై తాము నిలబడి స్వశక్తితో తమ జీవితాలను చక్కదిద్దుకో గలిగే జ్ఞానము, నైపుణ్యములను అందించడం జరుగుతుంది. ఇక్కడ ఆధ్యాత్మిక విద్యను వైతిక, భౌతిక, ఆధిభౌతిక విద్యలతో మేళవించి సమగ్రమైన ఒక విద్యావిధానమును విద్యార్థులకు అందించడానికి ఏర్పాటు చేశాము." (దై,ది.పు. 373)