నీ నిత్యజీవనయాత్ర సాగించు - జీవా ॥
యత్న ప్రయత్నముల్ మానవధర్మము
జయాపజయముల్ దైవాధీనము ||సత్య||
భక్తితోడ భగవంతుని దలచుచు
నిత్యధర్మములు నిర్వర్తించిన
అట్టి జనకునకు రాజయోగమున
అందరాని మోక్షంబుపొందెనే ||సత్య!
అష్టసిద్ధుల సాధ నెందులకు? (భక్తులకు)
అది వట్టి భ్రమలతో కట్టివేయునుగా
దట్టమైన యీ జీవితాటవిలో
వట్టి నామమే పట్టపగ లౌ|| సత్య||
హృదయభూమిని సాగు చేయండి
మీ మనసు మడుకగ, గుణములే ఎద్దుల్
వివేక మను చలకోలను దీసి
విశాలమగు మీహృదయము దున్నుడు ||సత్య||
మానవ ధైర్యము మంచి ఎరువుగా
ప్రేమధారలే పంట విత్తులుగ
భక్తే వర్షము భావమె కలుపులు
బ్రహ్మానందె పండెడుపంట ||సత్య||
కర్మయోగమే జన్మధర్మంబు
స్మరణే మానవ జన్మరహస్యము
సాధనే భక్తుల సారలక్షణము ||సత్య||
కష్టసుఖములు కర్మ లనకండి
మన యిష్టలోపమే కష్టమౌనండి
పట్టువీడక ఆ పాదము గొలచిన
గట్టుజేర్చుట తన పట్టేను|| సత్య||
మొదటి పట్టును విడువబోకండీ
ఎన్ని బాధలను పొందిన భగవ
చ్చింతన మాత్రము విడకండీ ||సత్య||
ఎదను విడడు యెడబాయలేడు.
మిమ్మేలుచుండు యేవేళ భక్తుల
కరుణయే ఆతడు - అతడె కరుణని
కరుణకై కాచి పొందండీ ||సత్య||
సాయి సాయి సాయి రామా యని
మీరు రయమున పాడగ రారండీ
ప్రేమమీర ఓ సాయిరామ యని
పిలిచి తరింతురు లేవండీ
కుక్కతోకయగు మానవ మనసును
చక్కగ బరచును రారండీ
ఒక్క మనసుతో నమ్మి సాయిని
చక్కగ స్మరణము చేయండీ
పుట్టుట గిట్టుట రెండే జన్మకు
గట్టివనుచు మది తలచండీ
వట్టి భ్రమలతో మునిగి కర్మలు
యెట్టివిచేయక మెలగండీ
కలియుట బాయుట కాలవాహిని
కాంక్షలు విడిచి చూడండీ
కర్మయోగమే జన్మకు ముఖ్యము
ధర్మము నడిచి మెలగండీ
నామస్మరణమే ముఖ్యవిద్యయని
నియమముతో సేవించండి
తక్కినవన్ని వుళక్కి విద్యలు
పక్కకు నెట్టుట చూడండీ
తన తలపెల్ల ఫలింపకున్న యిక
దైవము వలదని యనకండి
దయకు ప్రాప్తుడై మెలగిన
తలపుల- ఫలమున కొరతేముందండీ
కూటికి పేదయు కోటీశ్వరుడును
కాటికి యేగుట సమమండీ
కోతిగుణంబులు మాని యీ పరం
జ్యోతిరూపమును చూడండీ
పామఱత్వమే ప్రకృతి అంద మను
పాటను మీరక మానండీ
పరులబాధలు తమయట్టివి యని
సమముగ మదిలో తలచండీ
మానవధర్మము మాధవయాజ్ఞని
మర్మమెఱిగి భజయించండీ
సర్వజన ప్రియ సాయీశుండని
సారెకు మదిలో వేడండీ
లోకముకై దిగులొందక మీరు
లోకేశుని సేవించండీ
వర్ణాశ్రమధర్మంబులు వదలక
ఓపికతో సాధించండీ
మనసుకు లోనై మరుమాటాడక
మాధవస్మరణము చేయండీ
మర్మమెఱింగిన మరునిముసంబులో
మనసే వారికి గురుడండీ
భక్తి-జ్ఞాన-వైరాగ్యము లన
“మాకు శక్తి చాలద"ని యనకండీ
నామస్మరణలో కూడినవి
నయ-భయ-విశ్వాసము లేనండీ
చీకటి వెలుగులు కష్టసుఖంబులు
చేసినకర్మకు ఫలమండీ
బాగుగ నమ్మక వోగువ యేడ్చే
పామఱత్వమును వదలండీ
జాతి-నీతి-మత శాస్త్రములాదిగ
దైవలీల లని తలచండీ
యెట్టిబాధలను పెట్టిన మరువక
సాయిరామయని తలచండీ
నరుడవైనందకు పరమాత్మా యని
తలచిన, నరుడని యెంచండీ
భగవన్నామము వలదనె నరుని
నరపశువని భావించండీ
రామకృష్ణ గోవిందా హరి
నారాయణ శివ యని తలచండీ
అన్ని నామములు పరమాత్మవె యని
భేదమడచి భజియించండీ
సృష్టియంతయు భగవత్సంతతి
భక్తుల మని భావించండీ
భక్తులందరూ సోదరీ సోదర
ప్రేమభావములు పెంచండీ
ప్రేమే దైవము-దైవమె ప్రేమని
ప్రేమభావములు పెంచండీ
ప్రేమలలో నిష్కామ ప్రేమను
పట్టువిడువక సాధించండీ
పాయిరామ యని నామము తలచిన
సర్వబాధలూ తొలుగండీ
నియమముతో సేవించువారికి
నిశ్చలతత్త్యము కుదురండీ
పుణ్యకార్యములు చేయకున్ననూ
పాపములను తల పెట్టకండీ
పాపము లన్నింటికంటే మించినది.
పరులను నిందించేదండీ
ఇట్టిగుణంబులు నేర్చినవారికి
ఇహపరసుఖములు కలుగండీ
సాయిరామ యని భజనలు చేసిన
ఇహపరసుఖములు కలుగండీ
సత్యము ధర్మము-శాంతము-ప్రేమ
ఉత్తమ స్థితికి త్రోవండీ
కామ క్రోధ-ద్వేషంబులను
చుట్టి చూరము పెట్టుట మేలండీ
బీదసాద లన భేదభావములు
సాయికి మదిలో లేవండి
పర్తివాసుని పాదము వీడక
పదములలో మీరు పాడండీ
చింతలెల్ల బాపుకొని మనరాదా! (నీ)
శివసాయీశుని గనరాదా జీవా!
సువివేకంబును గొనరాదా జీవా!
శివమెత్తి జగమంత తిరిగేవు
ఓ చిత్తమా! నీకెంత సిగ్గులేదే
అవనిసుఖంబుల కల్లాలెడి
నీ కాలికి మిగిలే నది యేది? ||శివ||
ప్రొద్దుబోక యూరివారి సుద్దులన్న
మీరు సిద్ధమౌదురే కడుశ్రద్ధతోడ
ముద్దుముద్దుగాను సాయి ముచ్చటలు చెప్పునపు
డొద్దికగనుండరే చెవులారా! ||శివ||
పనిమాలి సినిమాలు పలుమాఱు
మీరు చనిచని కవినను తనివి లేదే
క్షణమును దైవసన్నిధిలో నిల్వగ
కనులారా! కడుకష్టమౌ గా? ! ||శివ||
అవినీతిరోతమాట లందరితో
నీ వనుటకు గౌరవమయ్యెనుగా
నవనీత చోరుని నామము బల్కుట
నాల్కా! అవమానం బగునా? ||శివ||
పనిలేని శునకంబువలె నీవు
పరుగిడి వగరించి తిరిగేవు
కణమును సత్సంగతిలో నిల్వగ
సాధ్యముగాదా చరణములా! ||శివు||
ఇచ్చవచ్చు చెడ్డపను లెల్ల సేయ
ఆ యీశ్వరుండు మిమ్ము సృజియించినాడా?
తెచ్చుకొని - చేతులారా ! - తెల్వి యింకనైన మీరు
ఇచ్చెరను హరిపూజ చేయరారే! ||శివ||
పాటలు పాడిన ఫలమేమి?
మంచి మాటలు నేర్చిన మహిమేమి?
సూటిగ పెద్దల బాటనె పోయిన
సుఖములమూటను దొరకునుగా ||శివు||
సులువుగ దొరికిన సుందరసాయిని
చులనకనజేయగ జాతువుగా!
పలుబొమ్మలకే పడిపడి మ్రొక్కిన
భయభక్తులతో బ్రతుకుదువా! ||శివు||
(భస.శ్రీసా.పూ.వి.పు.82/89)