చాలమంది. శివరాత్రివేళ జాగరణ చేయాలని,పేకాట
ఆడుతూ రాత్రంతా మేలుకుంటారు.
"పేకాటనాడుచు ప్రీతితో నారాత్రి గడిపినందులకె
అది జాగరణ యగునా? చేపల కొరకునై
చెఱువులో జాలర్లు పొంచి చూచెడి దృష్టి
ధ్యానమగునా? భార్యపై అలిగి భర్త తా
పస్తుండిన అది గొప్ప ఉపవాసమగునా?"
శివరాత్రి అనగా ఏమిటి? పవిత్రమైన భావాలను పోషించునదే శివరాత్రి, దివ్యమైన ప్రేమను అభివృద్ధి పర్చునదేశివరాత్రి; దుర్గుణములను, దురాలోచనలను, దుర్బుద్దులను దూరం చేయునదే శివరాత్రి. కనుక సత్యాన్ని గుర్తించుకొని సత్యమైన మార్గంలో ప్రవేశించండి. మనస్సు చంద్రునితో పోల్చబడింది. చంద్రునికి 16 కళలున్నాయి. వీటిలో ఈ రాత్రి పదిహేమ కళలు దైవంలో లీనమైపోయి, ఇంక ఒక్క కళ మాత్రమే మిగిలి ఉంటుంది. దైవాన్ని స్మరించడం చేత ఆ ఒక్క కళ కూడా దైవంలో లీనమై పోతుంది. కనుక సంవత్సరమునకు ఈ ఒక్క రాత్రంతా భజన చేసినారంటే ఎంతో అదృష్టవంతు లవుతారు మీరు. సంవత్సరంలో ఒక్క రాత్రియైనా మేలుకొని దైవచింతన చేయగలరా? భజనలోని ఆనందం, భగవన్నామంలోని మాధుర్యం ఇంకెక్కడా చిక్కదు. ఎంత ఖర్చు పెట్టినా లభించదు. ఇది కేవలం ప్రేమచేతనేలభ్యమవుతుంది. కనుక ప్రేమను పెంచుకోండి. పవిత్రలను పెంచుకోండి. జీవితాన్ని సార్థకం గావించుకోండి.
(స.సా.మా.99. పు.66)
(చూ! యుక్తి, శాస్త్రములు)