ప్రకృతి, పురుషుడు అని రెండు పదములున్నవి. ప్రకృతి అనగా జడము. అదే దేహము. దీనినే స్త్రీ అన్నారు. పురుషుడు అనగా చేతనాశక్తి. ఈ చేతనా శక్తియే పురుషత్వము. ఇదే ఆత్మ. ప్రతి దేహమునందు ఇవి రెండూ అన్యోన్యాశ్రయమై ఉంటున్నది. దేహము జడమని, చైతన్యము పురుషుడు, దేహము స్త్రీపురుషత్వ సమ్మిళిత రూపమని చెప్పవచ్చు. దీనినే జడచైతన్యముల అంతరిక స్వరూపమని కూడా చెప్పవచ్చును. శివశక్త్యాత్మక స్వరూపమని కూడా భావించవచ్చు. కనుక ప్రతి జీవికీ ఈ పురుషార్థములను సాధించుటకు అధికారమున్నది.
(స.సా. ఫి.85 పు.33)