భరత శాస్రమనెడి బంగార మన కుండ
పరశాస్త్రములనెడి పాపమేలు
భక్తి యేల హైందవ ధర్మహిమాద్రులమునకుండ
పరధర్మములను పర్వతములులేల
భరతనీతి యేనని భవ్య జనములుండ
పర నీతియనుఉప్పునీరుయేల
మండెడు కాంతితో మేరు పర్వతముండ
వెండి బంగారులకై వెదుకనల
అడిగిన పాలిచ్చు కామధేను వుండ
ధనమిచ్చి ఆవు కొనగనేల
పంక జాక్షుని పూజ పలు మారులు చేయక
పరుల నిందుంచుట పాడియగునే
(శ్రీ.వా.జూ. 2015 పు 23/24)