విద్యార్థులారా! మీరు పుట్టినది భారతదేశంలో మీరు పీల్చుకునే గాలి భరతమాతగాలి. మీరు త్రాగే నీరు భరతమాత నీరు. మీరు అనుభవించే సంపత్తి అంతా భరతమాత సంపత్తి. కనుక భరతమాత పవిత్ర సంస్కృతి మీరు గుర్తించి వర్తించడానికి ప్రయత్నించండి. అప్పుడే మీ జీవితం సార్థక మవుతుంది. లేకుంటే
తన్నొసట వ్రాత తప్పించ నెవరి తరము?
చెడ్డ బుద్ధులు తన తలచేరినేని
ఎండ బారును బుద్ధులు బెండుబారు
(స.సా.డి.96పు.322)
దివ్యాత్మ స్వరూపులైన విద్యా బోధకులారా ! అధ్యాపకు లారా !
ప్రేమరూసులాగా |
ఖండ ఖండాంతరంబుల ఖ్యాతి నార్జించిన -
మహనీయులను గన్న మాతృభూమి.
పాశ్చాత్య వీరుల పారద్రోలించియు,
స్వాతంత్ర్యమును గొన్న సమర భూమి.
సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యలందు
ధీ శక్తి చూపిన దివ్య భూమి
చిత్ర కళల తోడ చిత్రమై
యున్నట్టి భరత భూమి
భరత మాత యొక్క భాగ్యంబు కాపాడ
బాధ్య తంతయు మిదే.
ఉపాధ్యాయులారా !
సర్వ సద్గుణములు చక్కగా లేకున్న
వారు గురువులు గారు వా స్తవమున
సవినయుండు గాక సచ్చరిత్రుడెట్లగు
ఉన్న మాట తెలుపుచున్న మాట.
((శ్రీ సత్యసాయి దివ్యబోధ 1978 పు 173)