ఖండ ఖండాంత ఖ్యాతి నార్జించిన
మహనీయులను గన్న మాతృభూమి
పాశ్చాత్య వీరుల పారద్రోలించుయు
స్వాతంత్ర్యమును గన్న సమరభూమి
పాండిత్యమున చాల ప్రఖ్యాతి గాంచియు
ప్రతిభ చూపించిన భరతభూమి
సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యల
ధీశక్తి చూపిన దివ్యభూమి
చిత్రకళల తోడ విచిత్రమైయున్నట్టి
భరత భూమి యందు జననమొంది
భరతమాత దివ్య భాగ్యంబు కాపాడ
బాధ్యతంతము మీదె బాలబాలికలార!
(స.పా.డి.96పు.321)