ఈనాడు సాయి సంస్థలు గురించి అనేక విధములుగా మన అనిల్‌కుమార్ చెప్పాడు. సంస్థలు జరుగుతున్నాయి. భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు. కాని లక్ష్యమేమిటో అనేటటువంటి తత్వాన్ని గుర్తించడానికి వారు తగిన కృషి చేయడం లేదు. నీ తృప్తి నిమిత్తమై ఆచరిస్తున్నావా? లేక దైవ తృప్తి నిమిత్తమై ఆచరిస్తున్నావా? ఇదియే ఒకానొక సమయంలో ఒక భక్తుడు జీసస్ వద్దకు వెళ్ళి "స్వామీ! తనను తాను రక్షించు కొనగలుగు శక్తి ఏమిటి? అన్నాడు". నాయనా! నేను భగవంతుణ్ణి ప్రేమించినప్పుడు ఆశక్తి తనను తాను రక్షింపచేస్తుంది.” అన్నాడు. ఇదియే భగవద్గీతయందు కూడనూ. స్వామి! భగవత్ ప్రేమకు పాత్రులు కావడానికి ఏమిచేయాలి? అన్నాడు. పిచ్చివాడా! నీవు భగవంతుడని ప్రేమిస్తున్నావని భ్రమిస్తున్నావు. భగవంతుడు నిన్ను ప్రేమించేటటువంటి మార్గాన్ని వెతుకు" అన్నాడు. నీవే భగవంతుడవై ఉన్నావు. అలాంటి భగవంతుని యొక్క తత్త్వాన్ని మొట్టమొదట నీవు గుర్తించటానికి తగిన ప్రయత్నము చేయి! ఏ విధంగా చేయాలి? ఒకటే మార్గము. ప్రతి మానవుడు కూడనూ దివ్యాత్మతో ప్రేమించు! అందరినీ సేవించు. దీనినే The best way to Love God, is to Love all, Serve all. మనం అందరిని ప్రేమించాలి. ఎందుకనగా ఆ రూపంలో ఉన్నాడు. భగవంతుడు, ప్రతి మానవుని యొక్క స్వరూపము కూడనూ భగవంతుని యొక్క వేషమే.
(శ్రీ ఫి.1955పు.22)