బ్రహ్మచర్యం అంటే పెళ్ళి చేసుకోకుండా వుండటం కాదు. బ్రహ్మయందు చరించటం. అందుకు ఆలోచనలు పవిత్రంగా వుండాలి. మనస్సు నిర్మలంగా వుండాలి. ఆచరణ స్వార్థరహితంగా వుండాలి. చిత్త శుద్ధి కనిపించాలి. హనుమంతుడు ఎప్పటికి బ్రహ్మచారే. సువర్చల ఆయన భార్య అంటారు. అయినా ఆయన బ్రహ్మచారి ఎలా ఆయ్యాడు? దుకంటే ఆయనకు రాముడు తప్పమరో విషయం తోచదు. సర్వస్వం రాముడే. ఆయన సదా బ్రహ్మంలోనే వుంటున్నాడు. బ్రహ్మంలోనే చరిస్తున్నాడు. కనుక బ్రహ్మచారి అయ్యాడు.
నీ ఆలోచనలనూ, వాక్కులనూ చేతలనూ బ్రహ్మ పరం చేయి. అసలైన బ్రహ్మచారివికా !
(శ్రీ.సా.గీ.పు.32)