గృహస్తుడు కాకుండినంత మాత్రమున బ్రహ్మచర్యమని తలంతురు. అది చాలా పొరపాటు. యదార్థము అదికాదు. తన చిత్తమున ప్రపంచ వ్యామోహములకు చేరనీయక దైవచింతనా తత్పరుడగుచు వింతలు విశేషములు వినక, చూడక, యే రుచులనూ కోరక ఆనంద దుఃఖములకు లోనుగాక, మనోబుద్ది అహంకారములకు సాధ్యపడక, నిష్కామ, నిర్మొహ, నిర్ద్వంద్వ, నిర్విషయ, నిశ్చలుడై, అన్నింటియందు, అన్ని వేళలందు బ్రహ్మతత్వములోనే నిలిచుయుండు మనొస్వరూపమును, బ్రహ్మ చర్యమని పిలువబడును.
(ప్ర. శో.వాపు 9)
(చూ॥ గృహలక్ష్మి, మానవజీవితము)