"తత్వైవాహం" నేను భగవంతుని భక్తుడను అని ప్రారంభములో చెప్పుకుంటాడు.ఇందులో భగవంతుడు వేరు తానువేరుగానిరూపించుకుంటాడు.తత్వైవాహంలో నేను ప్రత్యేకంగా వుంటున్నాను.దేవుడు యెక్కడో వుంటున్నాడు. అతనిని చూడటం కోసమని అతనిభక్తుడుగా నేను తయారవుతున్నాను అని భావిస్తాడు. క్రమక్రమేణ యీ భక్తిని అభివృద్ధి గావించుకొని తవైవాహం అంటూ ముఖాముఖిగా వచ్చి భగవంతుడా నేమ నీ భక్తుడవు, నేను నీ భక్తుడను అని ప్రారంభిస్తాడు. తవైవాహం అన్నప్పుడు యెదురుగా నిల్చి భక్తుడు భగవంతునితో నేను నీ భక్తుడనని దీనంగా చెబుతున్నాడు. మూడవది త్వమేవాహం నేను నీవేను అని అంటున్నాడు. నేను దైవ భక్తుడను అనుకోవటం ద్వైతము, నేను నీభక్తుడను అనుకోవటం విశిష్టాద్వైతం.నేవే నేను అనుకోవటం అద్వైతము,మనము ద్వైతములో ప్రారంభము సలిపినప్పుడే ఆద్వైతములో ప్రవేశించటానికి అర్హులమౌతాము. మొట్టమొదట సామాన్య భక్తితో ఆరాధనను ప్రారంభించాలి. సాకార సగుణములు లేకుండా నిరాకార నిర్గుణములు ప్రాప్తించవు. ఇది అసాధ్యము కూడను. కనుక మొట్టమొదట దాసులుగా తయారు కావాలి..
దీనికి మరొక ఉదాహరణము. ఒకవైపున పెద్దసున్న వుంటుండాది. దానికి ప్రక్కనే ఒక చిన్న సున్న వుంటున్నది. ఈ పెద్దసర్కిల్ దైవము. చిన్నదే జీవుడు. ఈ జీవుడనేవాడు దేవునకు ప్రత్యేకంగా వుంటున్నాడు. ఇది ద్వైతము, విశిష్టాద్వైతమనగా పెద్ద సున్నాలోపల చిన్న సున్న వుంటుండాలి. అనగా దైవములో జీవుడున్నాడు. అయితే యీజీవుడు దైవములో వేరే విధానము యేమిటి?ఈ చిన్నసున్న క్రమక్రమేణ విశాలమైన భావములు పెంచుకొని పోతూపోతూ యీ పెద్దపున్నలో లీనమైపోతుంది. ఇదే అద్వైతము అన్నారు. జీవతత్వమును దైవత్వములో చేర్చటానికి తగిన కృషి చేయటమే భక్తి ప్రపత్తుల మార్గము.
(శ్రీగీపు.61)
కొంతమంది చెపుతుంటారు - - చిన్న వయస్సు నందు ఎందుకీ భక్తి ప్రపత్తులు? రిటైరైన తరువాత భగవంతుని స్మరించవచ్చు" అని. రిటైరైన తరువాత ఏమవుతుందో!
పదపదమంచు కింకరులు పాశము లాగెడువేళ,
బంధువుల్ దబదబ బయట పెట్టుడిక లాభము
లేదని చెప్పువేళ, ఆలుబిడ్డలున్ లబలబ
ఏడ్చువేళ, తరమా హరినామము నోట పల్కాగన్
ఉద్యోగంలో చేయలేనిది రిటైరైన తరువాత ఏమి చేయగలరు?
(స. సా.ఏ.99 పు.105/106)
(చూ॥ అయోధ్య, దూపాటి తిరుమలాచార్యులు, భావములు, శరణాగతి, హనుమంతుడు)