విద్యార్ధులారా! మీరు తలుస్తున్నారో లేదో! కాని ఈ - భరతమాత మీ నిమిత్తమై ఎంత పరితపిస్తున్నదో మీకుతెలియదు. కాని మీరు భారతదేశంలో పుట్టామనే విషయాన్ని గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయడం లేదు. మీ నిమిత్తమై భరతమాత కావల్సినంత సంపదను దాచి పెట్టింది. ఈ సంపదకు అంతేలేదు. ఏమిటి ఆ సంపద? విజ్ఞాన సంపద. ఆధ్యాత్మిక సంపద. అదియేమీ జీవిత రస సంపద. ఈ సంపదలను మీకు కావల్సినంత పెట్టుకొని ఉంది భరతమాత. విదేశీయులు వచ్చి దానిని అనుభవిస్తున్నారు గాని, స్వదేశీయులు దానిని అనుభవించ ప్రయత్నించడం లేదు. అందరూఅనుభవించండి. ఇది "బృందావనమది అందరిది గోవిందుడందరి వాడేలే!ఆధ్యాత్మికము నందు సర్వులకూ అధికారముంది. విదేశీయులైనను దీనిని అనుభవించ వచ్చు. కనుక మీరు అనుభవించి, ఆనందించి, మీతోటి మానవులకు. దీనిని పంచి పెడతారని నేను ఆశిస్తున్నాను.
(శ్రీ జ.95 పు.11)