"ధనము వలన దానమును, వాక్కువలన సత్యమును ఆయువువలన కీర్తియును, దేహమువలన పరోపకారమును. ఈ విధముగా పాలనుండి వెన్నవలె నిస్సారమైన సంసారమునుండి సారభూతమైనఆత్మసంపదను గ్రహింపవలెను. తత్త్వజ్ఞానాభిలాష గల బుద్ధిశాలురు. ధనికులయ్యను చాంచల్యము లేకయు, ప్రభువులయ్యునూ ప్రమాదము లేకయు సంచరించు చుందురు",
(జ్ఞా.వా.పు.78)