108 సంఖ్యకు ప్రాముఖ్యమేమిటో మీలో చాల మందికి తెలియక పోవచ్చును. దేవతల స్తోత్రాలన్నీ, 108 సంఖ్యను మించవు. 110 కాని 112 కాని, 50 కాని 60 వుండవచ్చు. కదా! అల్లా పుండక 108 వుండటానికి కారణము వుంది. అటువంటి సంఖ్యలకు సంకేతార్థం వుంది.
(శ్రీ స.వ. 63/64 పు. 183)
మనిషి ఒక గంటలో 900 సార్లు ఊపిరి పీల్చుకుంటాడుఅంటే రోజుకు 21,600 సార్లు, పగటివేళ 10,800 సార్లు శ్వాస తీసుకుంటాడు. అంటే ప్రతి శ్వాసలోనూ సోహం అని ఉచ్చరించుకోవాలి. కాబట్టి 216 అనే దానికి , అందులో సగం 108 కే ప్రాధాన్యం ఉన్నది. తొమ్మదిని పండ్రెండు సార్లు హెచ్చవేస్తే 108 అవుతుంది. ఆ బ్రహ్మమునకు సంకేతం. ఏ సంఖ్యతో హెచ్చవేసినా దాని మొత్తం. తొమ్మిదే. 9x12=108. కూడితే 1+8=9; 9x9=81; కూడితే తొమ్మది: 12 అనేది ద్వాదశ సూర్యులను సూచించగలదు. సూర్యుడు 12 రాసులలో 12 మాసాలలో సంచరిస్తాడు.
అదే విధంగా 8 మాయకు సంకేతం. ఎనిమిదిని ఏ సంఖ్యలో హెచ్చవేసినా మొత్తం కూడినప్పుడు 8 కంటే తక్కువగా ఉంటుంది. తరిగిపోతూ ఉంటుంది.(2x8=16: కూడితే 7: 3x8=24, కూడితే 6: 4x8=32, కూడితే 5: 5x8=40 అంటే నాలుగు మిగులుతున్నది. 6x8=48 కూడితే 12, మొత్తం 3: 8x7=56, కూడితే 11, మొత్తం 2; 8x8=64 కూడితే 10, మిగిలేది ఒకటి) ఈ విధంగా దాని విలువ తరిగిపోతూ వుంటుంది. కాబట్టి 8 మాయకు సంకేతం. మీకు మీరు ద్రోహం చేసుకోవద్దు. మీరు ఒకటి చెప్పి మరొకటి చేస్తే మీ అంతరాత్మ మిమ్మల్ని ద్రోహులుగా నిరూపించి ఖండిస్తుంది.
(శ్రీ స.సూ. పు. 65)