మానవత్వములో తృప్తి రావాలి. అసంతృప్తి ఉండకూడదు. Who is the richest man in the world. ప్రశ్నించుకోండి. He, who has much satisfaction is the richest man. He, who has much desires is the poorest man. ఏ ఆశలు లేకుండా ఉంటే అదే నిజమైన greatness. మీకందరకు తెలియదుగాని ఈ birth and death నాకు తమాషాలు. స్వామీ మావారు చనిపోయినారంటే సంతోషము సంతోషమంటాను. యజమాని చనిపోతే నీకేమి సంతోషము? నాకన్నింటికి సంతోషమే. ఒక వ్యక్తి స్వామి నాకడుపుకోతనేను భరించుకోలేను దుఃఖములోనున్నాను. బాధను సహించు కోలేను" అంది. చాలా సంతోషము అన్నాను. అన్నింటికి సంతోషమే.
(ద. య. స.97 పు. 77)