తృప్తి

భగవత్ప్రేమను పెంచుకోండి. భగవంతుడు సర్వులయందు ఉంటున్నాడనే విశాలత్వము అభివృద్ధి పరచుకోవాలి. భగవంతుడు ఏనాడూ మిమ్ములను మరవడు. మరచేది భక్తుడే. God never leaves his devotees, only devotees leave God. God never goes away from his devotees but devotees go away from God. పోయేది భగవంతుడే అనుకుంటారు. కాని భగవంతుడు పోవటం లేదు. భక్తులే పోతున్నారు. భగవంతుడు విడచటం లేదు. భక్తులే విడుస్తున్నారు. ఈ సత్యాన్ని మీరు గుర్తించుకోలేక పోతున్నారు. లోక వాసనల చేత లోక భ్రాంతులచే కట్టబడటం చేత మానవత్వము బంధింపబడి పోతున్నది. ఈ సత్యాన్ని మీరు గుర్తించు కోండి. అదే నిజమైన Conscience. అదే మీ witness, దానిని తృప్తి పరచుకుంటే జీవితమంతా తృప్తి అవుతుంది.

(బ్బత్ర.పు. ౯౧)

 

తృప్తి యేలాభము: తృప్తి కన్న మనుజునకు లాభము చేకూర్చుపదార్థము వేరొకటిలేదు. ఈ సంతృప్తిని మూడులోకములకంటే మిక్కిలి ధనమని చెప్పవచ్చునుఅట్టి వాడు అనుభవించు భగవత్ విభూతులు ఇతింత అని చెప్పరానివిగా ఉండును. నీ ఇష్ట ప్రకారము నడవవలెనే కానినీవు దానికి లొంగిపోవలదు.

                                                                                                                   (ఆ.శా.పు.50)

(చూ॥ ద్రౌపదిధనవంతులుపానీయంసంతృప్తి)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage