ఒకటి శ్రద్ధగా గ్రహించవలెను. గమనించవలెను. బాహ్యవిషయములందలి మోహము వదలిననూ అంతరంగమందుండు కోరికలు నశించనిదే లాభములేదు. దీనినే "తృష్ణ" అందురు. లోపల వెలుపల నుండు వాసనలు నశించిన పిదప కలుగు ఆశ ముక్తతృష్ణ అనబడును. తృష్ణలు వృద్ధి పొందుకొలది, మనస్సు అలజడిచెంది ఆశాంతి కలిగియుండును. ఆత్మజ్ఞానోదయ మొక్కటే అన్ని తృష్ణలను నిర్మూలింపగలదు.
(జ్ఞా.వా.పు.25)
(చూ॥ గోపికలు, శాంతము)