ఈనాటి విద్యలు లౌకికసంబంధమైనవి అయినప్పటికిని “ఇహమున సుఖియింప హేమతారక విద్య, పరమున సుఖియింప బ్రహ్మవిద్య". ఇది జీవనోపాధి: అది జీవిత పరమావధి. జీవనోపాధివిద్య లేకుండిన జీవిత పరమావధియందును, జీవిత పరమావధి మార్గమునందును మానవునకు అన్ని విధముల అభిరుచి కలుగనేరదు. కనుకనే లౌకిక విద్యలను కూడను మీరు అలక్ష్యము చేయరాదు. చదువులతో పాటు సంస్కారము అత్యవసరము. వాల్మీకి వ్యాసుడు ఈలాంటి మహర్షులందరూ ఆనాటి సంస్కారముతో పాటు లౌకికమైన చదువులు కూడను నేర్చుకోవటంచేతనే లోకమునకు పవిత్రమైన గ్రంథములను అందించి లోకమిత్రులు కాగలిగారు. 18 పురాణములు, వేదముల యొక్క విభాగములు ఆనాటి మహర్షులు చేయగలిగారంటే లౌకికవిద్యలు కూడను కొంత ఆదరణ తీసుకుంటున్నాయి.
( శ్రీ. సా.గీ. పు 67 )
(చూ|| ఆడంబరభక్తి)