సర్వమున్ కదలన్ జేసెడి కాలమూర్తికి నమస్కారము అన్నాడు భర్తృహరి. కాలము ఎవరినీ అనుసరించదు: ఎవరికోసమూ ఆగదు. శతమానం భవతు శతాయుః అన్నా అది విశ్వసించ దగినది కాదు. కారణము ‘నిత్యం సన్నిహితో మృత్యుః’ క్షణక్షణము కాయము మృత్యువును సమీపిస్తూనే ఉన్నది. గడచిపోయిన కాలమును క్షణమైనా వెనుకకు త్రిప్పలేము. కాల ప్రవాహమును గుర్తించి వర్తించడమే కర్తవ్యము. మానవత్వమును మరువక, లక్ష్యమును విడువక, మానవ సంఘమునందు మానవునిగా జీవించడమే జీవిత పరమార్థము.
(స. సా, సె. పు.20)
(చూ మత కర్తలు)