పరమాత్మ సముద్రమయితే నీ ఆత్మ అందులో చెలరేగే ఒక అలలాంటిది. సముద్రం వేరు, అలవేరు కాదు. కాని వేరు గా కనిపిస్తున్నాయి. ఆ రెంటి మధ్యా సంబంధాన్ని సరిగా అర్థం చేసుకోవటం లోనే జీవిత పరమార్థం వుంది. ఆహార నిద్రా భయమైధునాలవంటి కార్యక్రమాలు పశుపక్ష్యాదులకు కూడా సామాన్య ధర్మమే. మానవ జన్మ విశిష్టత ఆత్మ దర్శనమే.
పుట్టినప్పటి నుంచి గిట్టేదాకా పశుపక్ష్యాదులలాగా పొట్టపోసికొనే తాపత్రయమే అయితే జీవితం వృధాగా గడిచిపోతుంది. మళ్ళీ ఇంకొక జీవిత ఖైదు. (జన్మ) తప్పదు.
(శ్రీ,సా.గీ.పు.67)