జీవితకాలము అత్యల్పము. లోకము అతివిశాలము. కాలము అనంతము. అయిననూ అనంతకాలమునందే మానవుడు తనలోని దివ్యత్వమును కనుక్కొని ప్రకటించి అభివృద్ధి చేసుకొనవలెను. జనులు కామక్రోధద్వేషములను దూరముచేసి శాంతము, సౌమ్యము, సంతోషము మొదలైన సద్గుణములను అభివృద్ధి చేసికొనవలెను. వారు ప్రేమోన్మత్తులై, కార్యతత్పరులై, ఉత్సాహభరితులై తమతమ కర్తవ్యములను నిర్వహించినపుడే దేశమునకు క్షేమము.
(స్యీ పు.328)