తల్లి తన పిల్లల ముందు ఆట వస్తువులను పడేసి తన పని తాను చూచుకుంటుంది. పిల్లలు ఆడుతూ అప్పుడప్పుడు అమ్మ అని పిలుస్తారు. కానీ ఆమె పలుకదు. కొంత సేపటికి పిల్లలు ఆకలితోనో, ఆటలయందు విసుగుతోనే ఆమ్మా అని ఏడుస్తారు. అప్పుడామె వచ్చి వారిని ఓదారుస్తుంది. అటులనే జగన్నాత మానవుల ముందు జగత్తులో ఎన్నో వస్తువులు, వ్యవహారములనే వాటిని వుంచుతుంది. మానవులు లౌకిక వ్యవహారములనే ఆటలు ఆడుకుంటూ అప్పుడప్పుడు జగన్మాతను తలచుకుంటారు. ఆమె పలుకదు. చివరకు విసుగుపుట్టి ఇంకా ఏదో కావలెనని ఏడుస్తూ ఎలుగెత్తి జగన్మాతను పిలుస్తారు. అప్పుడామె పలుకుతుంది.
(భ.ప్ర. పు. 38)