గురువు

సర్వసద్గుణములు: చక్కగా లేకున్న

వారు గురువులు కారు వాస్తవమున

 సవినయుడుగాక సచ్ఛాత్రు డెట్లగు?

 ఉన్న మాట తెలుపుచున్న మాట||

(సా.పు. 332)

భుక్తి విద్యలన్ని బోధించిచెప్పేదితెల్పేది.

గురువులెల్ల ఫలము మార్చగలరా?

భుక్తి విద్యలెల్ల ముక్తి విద్యలు చేసి

మోహంబు తెగటార్చు గురువుకలడు||

గురుతు తెలియ సద్గురువరండు||

(సా|| పు. 158)

 

గురువును ఆధారముగా చేసుకొని అతని సుబోధనల చేత మనము ఉన్నత స్థాయికి చేరుతామనే విశ్వాసము మన భారతీయులది. శాస్త్ర సమ్మతమైన గురువులు ఎనిమిది మంది - బోధగురువు. వేదగురువు, నిపాతగురువు, కామ్యగురువు, వాచకగురువుసూచకగురువుకారణగురువువిహితగురువు అని. బోధగురువుకేవలముశాస్త్రార్ర్థముమాత్రమే బోధించి దాని యొక్క నిబంధనలు తగిన రీతిగా ఆచరించటానికి ఉత్సాహప్రోత్సాహముల నందించేవాడు. వేదగురువు తత్త్వార్థమును బోధించితత్త్వదర్శనమును గావించి మనస్సును దైవమువైపునకు మార్చేవాడు. నిపాత గురువు అనేక విధములైన సందేహములను రూపు మాపి మనస్సును పరిశుద్ధము గావించి చిత్తశుద్ధిచే ఆత్మత్త్వాన్ని గుర్తింపచేసేవాడు. కామ్యగురువు కొన్ని కామ్యకర్మలను బోధించి యిహ పరములందు మోక్షము నందించేవాడు. పుణ్య కార్యము లను ఆచరింపచేసేవాడు. తద్ద్వారా యిహపరములందు సుఖమునందించేవాడు.వాచకగురువు యోగతత్త్వము బోధించి దివ్యత్వమైన ఆత్మతత్త్యమును అనుభవింప చేసేవాడు. సూచకగురువు శమదమాది సంపత్తిని బోధించి మానవుని యొక్క ఇంద్రియములను నిగ్రహింపచేసేవాడు. కారణగురువు జీవ బ్రహ్మైక్యానుసంధానము కలిగించి చేసేవాడు. జీవతత్త్వాన్ని దైవతత్త్యముగా మార్చగలిగేవాడు. విహిత గురువు ఈ రెండింటి సంబంధము బింబ ప్రతిబింబముల యొక్క సంబంధమని బోధించేవాడు. జీవునకు దేవునకు భేదము లేదని నిరూపించేవాడు. ఆచరణ రూపమైన ప్రబోధములు సల్పేవాడు. ప్రత్యక్ష ప్రమాణములు నిరూపించేవాడు. ఈ గురువు ఒక్క దైవము మాత్రమే.

(శ్రీషి బా. పు. 22/23)

 

ప్రతి మానవునకు వృక్షములే ప్రధాన గురువు, దేహము యొక్క తత్త్వాన్ని మానవుడు అనేక మమకారఅభిమానములచే పెంచుకొని దానికి బద్దుడైదాసుడై తన దివ్యత్వాన్ని తాను మరిచిపోతున్నాడు. ఈ అభిమాన మమకారముల చేతనే మానవుడు ఈ తుచ్ఛమైన శరీరమును అనేక విధములుగ ఆధారము చేసుకొనిదివ్యత్వమైన అధేయమైన ప్రకృతిని విస్మరించి తాను స్వార్థమునందు మునిగి పోతున్నాడు. 

సుఖ దుఃఖములు సమానత్వాన్ని వహించి దివ్యత్వాన్ని లక్ష్యమునందుంచుకొని పవిత్రమైన జీవితమును గడపమని పర్వతములు కూడను బోధిస్తూ ఉన్నాయి. చలి యని పర్వతములు ఏ రగ్గును ధరించటము లేదు. ఎండలు ఎక్కువగా ఉన్నాయని ఏ hill station కో వెళ్ళటం లేదు, air conditioners వేసుకోవటము లేదు. వానలు ఏవిధంగా భరించాలనే భ్రాంతిచేత ఏ గొడుగులు పట్టటము లేదు. చలిఎండవానలు దేహమునకు గానీఆత్మకు సంబంధించినవి కావనే సత్యాన్ని గుర్తించుకున్న కొండలు మానవునకు అనేక విధములుగా ప్రబోధలు సల్పుతూ వచ్చాయి. ఇది రెండవ గురువు.

 

పక్షులు ఎప్పటికప్పుడుఆకలివేసినప్పుడు ఏదో ఒక ప్రదేశముకు వెళ్ళిఏదో తిని ఆనందముగాసుఖముగాశాంతిగా జీవితము గడుపుతూ ఉంటాయి. అంతేకాని రేపుమాపు అని ఈ Five year plans వేసుకుని ఆ తిండి తీర్థాలకై తాను శ్రమలకు పాటుపడటము లేదు. మానవ జీవితానికి రేపుమాపు అని చెప్పుటకు ఏమాత్రము ఆధారము లేదు. రేపు వరకు మనము నిలిచే సత్యమేమిటిఈ విధమైన నీటి బుడగవంటి జీవితమునకు రేపు మాపు అని అనేక విధముల ప్రాకులాడి జీవితమును కాలమును మనము వ్యర్థము గావించుకుంటున్నాము. ఇదే మానవత్వముకు తగినటువంటి దివ్యత్వము కానేరాదని పక్షులు కూడను ప్రబోధిస్తూ వచ్చాయి.

 

మన కంటే ఎదుట ఎంత మంది మరణిస్తున్నారు. ఎంత మంది జన్మిస్తున్నారు, ఎంత మంది మనలను వదలి వెళ్ళుతున్నారుఇవి మనం గుర్తించటానికి ప్రయత్నించడము లేదు. ఎన్ని చూచినప్పటికినీఎన్ని విన్నప్పటికినిఎన్ని అనుభవించినప్పటికినీ మానవుడు ఈ శరీర భ్రాంతిని వదులుకోవడము లేదు. కనుక దేహ తత్త్యానికి బాధ్యతలు తప్పించుకోవడము అత్యవసరము. ఏది మన ఇల్లుఏది మన భూమిఏది మన వస్తువు, ఏది మన తత్త్వము అని విచారించుకోకుండాఅన్నీ నాదీనేను అని స్వార్థ స్వప్రయోజనములతో కాయాన్ని విస్మరింప చేస్తున్నాము. ప్రకృతి యొక్క తత్త్వమే మనకు చక్కగా ప్రబోధిస్తూ వస్తున్నది. గడచిన వసంత కాలము తిరిగి వస్తున్నది. అనేక ఋతువులు తిరిగి వస్తున్నాయి. క్షీణించిన చంద్రుడు తిరిగి ప్రకాశిస్తూ ఉన్నాడు. కానీ నదీ జలమునరుని యౌవ్వనము తిరిగి రావు అని జగత్తే మనకు ప్రబోధిస్తున్నది.

 

గురువు-ఎవరు మనకు నిజమైన గురువుఈ విధమైన అంతర్ ప్రబోధనలు తెల్పునటువంటి ప్రకృతి మనకు నిజమైన గురువు కాదాఈ విశ్వమే మనకు గురువు. విశ్వమే కార్యమువిష్ణువే కారణము. కార్య కారణ సంబంధ స్వరూపమైనటువంటిదే ఈ విశ్వము.

 

"హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుందుసంశయము పనిలేదు. హరిమయము కాని వస్తువు పరమాణువు లేదు ఇలలో పరికించినచో - ప్రపంచ మంతయూ భగవంతుని యొక్క లీలామానుష విశేషమే.

(స.సా.ఆ. 1989 పు. 197/198)

 

మీరు పవిత్రమైన భావము చేత దైవము మీ హృదయమునందే ఉండినట్లుగా విశ్వసించి,సర్వము నాకు భగవంతుడేనిజమైన గురువు ఎవరు లేరు జగత్తులోఅందరికి గురువు ఒక్కడే దైవము. అన్ని దేశముల వారికి దైవము ఒక్కడే. కానీ ఆ దైవాన్ని అనేక పేర్లతో పిలవవచ్చు. పేర్లురూపములు వేరు కావచ్చు. ఎన్ని టెస్టులు మీరు చేసినా అందులో మూలాధార తత్వము గుర్తించుకుంటూ పోవాలి. గులాబ్ జాంమైసూర్ పాక్పాలకోవ ఎన్నెన్నో పేర్లు చెబుతుంటారు. అన్నింటిలో ఉన్నది చక్కెర. అదే విధముగా దైవత్వము అన్నింటియందు ఉంటున్నది. పిండిలో ఏ మాత్రము రుచి లేదు. దీనిలో చక్కెర కలిపినప్పుడు ఆ పిండే తీయగా ఉంటుంది. బేడల పిండి ఏ మాత్రము రుచి లేదు. దీనిలో చక్కెర వేస్తే లడ్డు తీయగా ఉంటుంది. గుణ సంపర్కము చేత ఈ రీతిగా మారిపోతున్నది. మీరు భగవత్ సంపర్కముతో మీ జీవితాల్ని సార్థకము చేసుకోండి..

(శ్రీ స. పు. 87)

 

అల్పగురువుల చెంత చేరకు - స్వల్ప గుణములు చింత చేయకు - తలపులన్నియు నిలిపివేసిన - తనువు కెప్పుడు జన్మ లేదు - కన్ను విప్పి చూడరోరన్నా!

(శ్రీ స.వి. వాపుట. 68)

 

"గురుచరణాంబుజ నిర్భరభక్తి:

సంసారాదభిరాద్భవ ముక్తః

దశేంద్రియ మానస నియమాదేవం

ద్రక్షసి నిజహృదయస్థందేవః 

దివ్యాత్మ స్వరూపులైన విద్యార్థులారా:* 

గురుచరణములందునిశ్చలభక్తి,, సంసారమునుంచివిరక్తి, యింద్రియ నిగ్రహముమనస్సును వశమునందుంచు కొనుట నాలుగు గావించిన వ్యక్తికి హృదయ స్థానమునందు వున్న దైవత్వము సాక్షాత్కరించవచ్చు అని శంకరుల కట్టకడపటి శిష్యుడు యీ శ్లోకమును అందించి కాశీనించి తిరిగి రావడానికి ప్రారంభించాడు.

(భ. స.బా. వే.ప్ర. పు. 162)

 

గురువులు విత్తాపహారులు కాకూడదుచిత్తాపహరులుగా మెలగాలి. అర్జునుడు కృష్ణుడు ఇరువురూ ఆదర్శ మూర్తులుఅర్జునుడు తపస్సంపన్నుడుమహాశక్తి మంతుడు. కృష్ణుడు ఆవతారమూర్తి. పురుషోత్తముడే గురువు: నరోత్తముడే శిష్యుడు. కాబట్టి ఆధ్యాత్మిక బోధ నిరర్గళంగా జరిగినది.

 

చివరకు "నష్టో మోహః స్మృతిర్లబ్థా కరీష్యే వచనం తవ అని శిష్యుడు ఒప్పుకొన్నాడు.

 

ఈ కాలంలో అట్టి గురువులు శిష్యులూ ఏ దేశములోనూ దొరకరు. గురువులు ఈనాడు శిష్యులకు బానిసలై వారినాశ్రయించి అనుసరించుచున్నాడు. శిష్యుల అభీష్టములనే గురువులు పురస్కరించాలిలేకపోతేశిష్యులు గురువులపై విశ్వాసరాహిత్యా తీర్మానమును తెచ్చి పెట్టుదురు. గురువులు కూడ స్వార్థపరులుఅహం కారముఅసూయద్వేషములు నిండిన వ్యక్తులుకాబట్టివారిలో పటుత్వముండదు.

 

శిష్యులకు విద్యాసంస్థలలో భారతీయ సంస్కృతిని పోషించిన దివ్య వ్యక్తుల చరిత్రలను అందించుటలేదు. వారి ఆదర్శములను పవిత్ర సూక్తులను యువకులకు బోధించుటలేదు. భావి భారతోద్గారకులైన యువతి యువకులుఅమెరికన్ యవతీయువకులనూరష్యా దేశపు యువతీ యువకులనూ ఆదర్శములుగా అంగీకరించి అనుసరించుచున్నారు. దీనికి మూలకారణము భారతీయ బోధకుల అశ్రద్ధ: వారికి భారత సంస్కృతి యొక్క ఘనతను గురించి యేమీ తెలియకుండుటే పిల్లలకు అర్థరహితమైననిస్సారమైన విషయములనే వారు బోధించుచున్నారు. పిల్లల నిర్మల నిశ్చల నిస్వార్థ హృదయములలో పవిత్ర ఆదర్శములను నాటి పోషించిన భవిష్యత్తులో వారికి సుఖశాంతులుదేశానికి అభివృద్ధి నెమ్మది కలుగును. ప్రప్రథమములోనే అర్థములేని అనర్థకారీ పదములను పిల్లలచే వల్లింప వేయుచున్నాము. "బాబా బ్లాక్ షీప్అనే వాక్యములే ఈనాటి ప్రారంభపాఠము. "ఓం నమో నారాయణాయ" "ఓం నమశ్శివాయఅనే పవిత్ర మంత్రములు కావు. దీనివలన పిల్లలు షీపుగా అంటే గొర్రెలుగా తయారవుచున్నారు. ఈ దుర్గతి నుంచి వారు తప్పించుకొనుటకు. మన వేదశాస్త్ర పురాణేతిహాసములనుంచిబైబిల్ ఖురాన్ మొదలైన పవిత్ర గ్రంథములమంచిపార్సీ బౌద్ధమత గ్రంథములనుంచి మహాత్ముల కథలను వారికి అందించవలెను.

 

ఇప్పటి దుర్భర పరిస్థితికి పెద్దలే మూలకారణము. తల్లుల వాత్సల్యము పోషణ శిక్షణ ఇవి పిల్లలకు లభించుటలేదు. కాన్వెంట్లుబోర్డింగ్ స్కూళ్లుకాలేజీలు అన్నీ తల్లిదండ్రులకు దూరముగా వుండి వారి ముఖములనే చూడకుండ వారు పెరిగి పెద్దలగుచున్నారు. వారు నిజముగా దురదృష్టవంతులేమాతృప్రేమ అనే అమృతరసమును గ్రోలకకోల్పోవుచున్నారు.  ఆయా  చచ్చిన వార్త వింటే పిల్లలు కంటినీరు కార్చుదురు కాని తల్లి చచ్చినవారికి కంటిలో చుక్క నీరురాదు. ఇట్టివాళ్లు మాతృదేవోభవపితృదేవోభవఆచార్యదేవోభవ అనే పవిత్ర సూక్తులను ఆచరణలో అనుభవింతురా?

 

"గురుర్ర్బహ్మా  గురుర్విష్ణుగురుర్దేవో మహేశ్వరః" అని గురువులను భారతీయులు ఆరాధింతురు. అయితే ఈనాడు గురువులు ఉత్తమ స్థానము నుంచి హీనమైన హాస్యాస్పదమైన స్థితికి దిగజారిపోవుచున్నారు. వారిలో దురలవాట్లుదురభ్యాసాలుదుర్గుణములుదుశ్చింతనలు ప్రవర్ధమానముగా పెరిగిపోవుచున్నవి. పిల్లలు చిన్న తనమందే ఉత్తమభావములను పెంచుకోవలెనన్న

అధ్యాపకులు తల్లితండ్రులు సరైన రీతిగా తీర్చిదిద్దుకోవలెను.

(స.సా. 2.76 పు.257/258)

 

స్వబోధే నాన్య బోధేచ్ఛా బోధ రూప తయాత్మనః||

 నదీపస్యాన్య దీపేచ్ఛా యథాస్వాత్మ క్రాశనే||

ప్రేమ స్వరూపులారా!

వెలుగుతున్న దీపమును చూచుటకు మరొక వెలుగు మనకెందుకు? ఈనాటి మానవుని హృదయము నిరంతరము ప్రకాశించుచునే ఉన్నది. కాని అట్టి సత్య నిత్యమైన ప్రకాశమును తెలుసుకొనలేక మానవుడు దీనిని తెలుసుకొనుటకు జ్ఞానము కావాలని ఆశిస్తున్నాడు. ఇట్టిదే పెద్ద అజ్ఞానమని చెప్పవచ్చు. ఇట్టి అజ్ఞానమును పోగొట్టుకొనే నిమిత్తమై మనము అనేక మంది గురువులను చేరుతున్నాము. నిజముగా ఆత్మ జ్ఞానమునకు గురువు అక్కరలేదు. ఇట్టి ఆత్మ జ్ఞానమును ఏ గురువు అందించలేడు. ఎందుకనగా ఈ ప్రకృతియే తన బిడ్డలను సంరక్షించే నిమిత్తమై అనేక ఆదర్శములను గైకొని వచ్చింది.

(ద. య స పు. 62)

 

సద్గుణములుసద్బుద్ధిసత్యనిరతిభక్తిక్రమశిక్షణకర్తవ్య పాలనములు నేర్పునదే విద్య, నేర్పునదే గురువు. విద్యార్థి నేర్వవలయును. ఇంతకన్నను నేనేమి ఎరుకపరతు సాధు సద్గుణ గణ్యులే! ఆధ్యాపకులారా!

(సాపు. 533)

గురువుచేసేఉపకారముబయటివిషయాలలోఏమీసౌఖ్యంలేదు, ఆనందముఉండదు. కుక్కఎండిపోయినఎముకనుగట్టిగాకొరికినప్పుడు, ఎముకవిరిగిదవడకుగుచ్చుకొనిరక్తముస్రవిస్తే, ఎక్కడినుంచిఆరక్తముఅనివిచారణచేయక, అదిఎముకనుంచేవస్తున్నదనిఆనందిస్తుంది. అట్లనేఆనందముకాని, దుఃఖముగానివిషయాలలోలేవు,

మీలోనేఉన్నవి. చంటిబిడ్డబొటనవ్రేలుచీకుతుంది. దానిలోసారమేమున్నది! ఆనందముబయటినుంచిదొరకునదనేఅభిప్రాయానికిఅమాయకత్వమేకారణం. ఇలాంటిసత్యనిత్యవిషయాలనుతెలిపేనిమిత్తంగురువుఅవసరము. అయితే, గురిఉంటేగురువుకావాలిగానిగురిలేకపోతేగురువేమిచేయగలడు! విత్తనముంటే, మొక్కఉంటే, తోటమాలిదానినిసరియైనరీతిగాపోషించిపెంచగలడు. ఉన్నదాన్నితెలియపరచుటేగురువుచేసేఉపకారము. నువ్వెవరు? నేనెవరు? ఎక్కడినుంచివచ్చాము? అనిప్రశ్నలువేసివాటికిఅనుభవరూపమైనసమాధానములనుశిష్యునిచేచెప్పిస్తాడు. ఇదేగురుశిష్యులపవిత్రసంబంధము.

(సనాతనసారథి, జులై 2019 చివరి పు)

 

దేహభ్రాంతియు లేక మెహమింతయు లేక
త్యా గ శీలులయిరి యోగవరులు గురులు
నాడు నేడు గురులట్టి వారాలే
ఉన్నమాట తెలుపుచున్న మాట
( శ్రీ సత్య సాయి దివ్య బోధ పు 1 -25 -7 -78 )

 

పసి పిల్లవానికి తన నాలుక తనకు ఉంది. అలాగే తల్లికి, తల్లి తొడమీద కూర్చో పెట్టుకొని బిడ్డకు మాటలు ఉచ్చరిస్తూ, మాటలు నేర్పుతుంది. తల్లి నాలుక ఎంత తీరిక లేనిదైనా, బిడ్డ తన నాలుకతోనే మాట్లాడ్డం నేర్చుకోవాలి. బిడ్డ బదులు తల్లి మాట్లాడ లేదు. తన భాధ్యత నుండి తప్పించుకోలేదు! గురువు కూడా అటు వంటివాడే! తను పునరుచ్చారణ చేస్తూ, జ్ఞాపకం చేస్తూ, ఉత్తేజాన్ని కలిగిస్తూ, నచ్చ అవుతూ, బోదిస్తుంటాడు; కాని శిష్యుడే ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించాలి, అతడే ఆ ఘంటాన్ని చేపట్టాలి. ఆ విధి నిర్వహణలో ఇతరులెవరు తనని పై కెత్తలేరు. శ్రీ సత్యసాయి బాబా (పర్తీశునితో పంచ దశాబ్దాలు పు 151)

 

సర్వ సద్గుణములు చక్కగా లేకున్న
వారు గురువులు కారు వాస్తముగ
సవినయుండుగాక సచ్చరిత్రుడెట్లగును
ఉన్నమాట తెలుపుచున్నమాట.
(మానసభరే గుతుచరణం పు 17)

 

"బ్రహ్మ సృష్టిచేయు బ్రహ్మాండమునెల్ల
విష్ణువన్ని పెంచి వృద్ధిచేయు
పరమశివుడు ద్రుంచు పాపిష్టి జీవుల
గురువు మూడు క్రియలు సలుపు నొకడె!” –
( స.సా.ఆగ.ష్టు2021 పు 15)

 

అధ్యాపకులు ఏమాత్రం కోపగించుకున్నా విద్యార్థులు సమ్మె చేస్తారు. ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ ఎజిటేషన్ గా మారింది. గురుశిష్య సంబంధము శోచనీయముగా వుంది.

“భారతావని గురుశిష్య భావముడిగె
సత్సంపద క్రమచర్య సన్నగిల్లె
భక్తి విశ్వాసములయందు రక్తి తొలగె
బాధ్యతలు లేని స్వాతంత్ర్యపరత హెచ్చె” - బాబా
(సనాతన సారథి, సెప్టెంబరు 2021 పు13)

 

హృద యమే ఉత్తమ బో ధకుడు . కాలమే ఉత్తమ గురువు. ప్రపంచమే ఉత్తమ గ్రంధము. భగవంతుడే ఉత్తమ మిత్రుడు. కనుక, గురువుల నిమిత్తమై మనం బాధపడనవములేదు. దైవ సంకల్పముచే నిర్మితమైన ఈ జగత్తు లోని ప్రతి జీవి మనకు అనేక పాఠములును బోదిస్తున్నాయి. కుక్క వలన మనము విస్వాసము, అనే దానిని నే ర్చుకొనవచ్చును. గాడిద ఓరిమిని నేర్పుతుం దు . సాలె పురుగు పట్టుదలను బోధిస్తుంది. చేప దూర దృష్టిని నేర్పుతున్నది. గుడ్లగూబ ఏకపత్నీమును బొధిస్తున్నది. ఈ విధముగా జీవరాసులు మానవునకు అనేక సత్య ములను నిరూపిస్తు న్నవి. (స.సా. జూలై 2012 పు 27 )

 

పసి పిల్లవానికి తన నాలుక తనకు ఉంది. అలాగే తల్లికి, తల్లి తొడమీద కూర్చో పెట్టుకొని బిడ్డకు మాటలు ఉచ్చరిస్తూ, మాటలు నేర్పుతుంది. తల్లి నాలుక ఎంత తీరిక లేనిదైనా, బిడ్డ తన నాలుకతోనే మాట్లాడ్డం నేర్చుకోవాలి. బిడ్డ బదులు తల్లి మాట్లాడ లేదు. తన భాధ్యత నుండి తప్పించుకోలేదు! గురువు కూడా అటు వం టివాడే! తను పునరుచ్చారణ చేస్తూ, జ్ఞాపకం చేస్తూ, ఉత్తేజాన్ని కలిగిస్తూ, నచ్చ జెపుతూ, బోదిస్తుంటాడు; కాని శిష్యుడే ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించాలి, అతడే ఆ ఘంటాన్ని చేపట్టాలి. ఆ విధి నిర్వహణలో ఇతరులెవరు తనని పై కెత్తలేరు. (పర్తీశునితో పంచ దశాబ్దాలు పు 151)

 

సర్వ సద్గుణములు చక్కగా లేకున్న

వారు గురువులు కారు వాస్తముగ

సవినయుండుగాక సచ్చరిత్రుడెట్లగును

ఉన్నమాట తెలుపుచున్నమాట.

( మానసభరే గుతుచరణం పు 17 )

 

గురువు అనగా అ జ్ఞానమును ని ర్మూలనము గావించు వాడు. కానీ దుర దృష్టవశాత్తూ, లొకములొ అఙ్ఞానమును నిర్మూలనము గావించే గురువులు లభ్యము కావడంలెదు. అఙ్ఞానమును మరల్చేవాడే గురువు. జగత్తుయొక్క భారమును భరించేవాడు గనుక జగద్గురువు అని చెప్పారు. ఈనాడు గురుత్వమనే దానినిగుర్తించ చాల కష్టము. గురుపూర్ణిమనాడు గురువును పూజించి, గురువును మెప్పించడమని అనుకొంటున్నాము. ఇది సరియైనఅర్థము కాదు. మానవుని మనస్తత్వము పవిత్రమై, నిర్మలమై, నిశ్చలముగా ఏనాడు మానవునిలో దేదీప్యమానముగా ప్రకాశిస్తుందో అదే గురు పౌర్ణిమ. మనయందు అజ్ఞానమును పూర్తిగా నింపుకొని, గురువును పూజించి, కానుకలను చెల్లించినంత మాత్రమున కలిగిన ప్రయోజనమేమిటి?

 

మల్లెకుసుమమాల మర్కటంబున కిచ్చి

పట్టు పీతాంబరములు పదిలపరచి

రమ్యమైన రత్న సింహాసనమిడిన

వదలునే తనదగు వక్రబుద్ధి?

కోతివంటి మనస్సును మార్పుచేసుకోకుండా ఎన్ని పూజలు చేసినా, ఎన్ని సాధనలను చేసినా దీని స్వభావము మారుతుందా?

 

మానవుడు మారినప్పుడే ప్రపంచము మారుతుంది

మనస్సును మార్పు చేసుకోకుండా ఎన్ని శాస్త్రములు గుర్తించిననూ, చదివిననూ, ఫలితముండదు. అనుష్టించక, ఆచరించక, శాస్త్రములను చదవడం పాలు ఇవ్వని గోవువంటిది. మానవుని నిర్మాణమే, విశ్వ నిర్మాణము. మానవుడు మారినప్పుడే ప్రపంచము మారుతుంది. వ్యక్తి పవిత్రుడైనప్పుడే సంఘము కూడా పవిత్రమవుతుంది. మారడము, పవిత్రులు కావడమే సాధన. సాధనవలన మానవుడు దివ్యత్వాన్ని గుర్తించాలి. (మా భ గు చ పు 67/68)

 

గురుత్వమంటే దేహతత్వమును అతిక్రమించి  జయించి ,ఇంద్రియముల    ఉద్రేకానికి అవకాశమియ్యనివారు. అట్టి గురువు ఎవరు అని చెప్పాలంటే , ఒక్క దైవము తప్ప మరెవ్వరూలేరు. ఏదో భ్రమచేత,    భ్రాంతిచేత ,విశ్వాసముచేత చిక్కినవారందరినీ గురువుగా భావించడo  అజ్ఞానము యొక్క లక్షణము. వారిని  అధ్యాపకులనవచ్చునుగాని , వారేనాడూ గురువులు  కారు. గుణాతీతుడు గురువు . అజ్ఞానమనే చీకటిని దూరము చేసి ప్రజ్ఞానజ్యోతిని వెలిగించేవాడు గురువు. ఇట్టి శక్తి దైవమునకు తప్ప అన్యులకు ఏమాత్రము ఉండదు. గురుత్వమంటే దేహతత్వమును అతిక్రమించి జయించి ,ఇంద్రియముల    ఉద్రేకానికి అవకాశమియ్యనివారు. అట్టి గురువు ఎవరు అని చెప్పాలంటే , ఒక్క దైవము తప్ప మరెవ్వరూ లేరు. ఏదో భ్రమచేత,    భ్రాంతిచేత ,విశ్వాసముచేత చిక్కినవారందరినీ గురువుగా భావించడo అజ్ఞానముయొక్కలక్షణము.   వారిని  అధ్యాపకులనవచ్చునుగాని , వారేనాడూ గురువులు  కారు. గుణాతీతుడు గురువు . అజ్ఞానమనే చీకటిని దూరము చేసి ప్రజ్ఞానజ్యోతిని వెలిగించేవాడు గురువు. ఇట్టి శక్తి దైవమునకు తప్ప అన్యులకు ఏమాత్రము ఉండదు.

అవతార పురుషుడైన గురువు తప్పులను శిక్షించి , ఒప్పులను మెచ్చుకుని, అందరినీ ప్రేమించుచు, సరైన ఆధ్యాత్మిక మార్గమును తెలుపుదురు. వారి పూర్ణనుగ్రహoవలన  క్షణములో జ్ఞ్ఞానసిద్ధికూడ అభివృద్ధి నొందుదురు. జనుల హ్రదయ భూమిని సాగు చేసి,    ప్రేమ బీజములను నాటి ఆనంద ఫలము నoదించెదరు. సృష్టి స్థితి , లయములు మూడును నెరవేర్చు శ్శక్తి అవతార పురుషునికి మాత్రమే ఉండును.

 

హృదయమునుండి అజ్ఞానాంధకారమును దూరము చేసి ఏనాడు ప్రశాంతి అయిన ఙ్ఞానజ్యోతిని వెలిగించుకొందుమొ ఆనాడే మనకు గురు పౌర్ణమి. అదే సరైన గురుపూజ. (మా భ గు చ పు (I/,ii)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage