గీతయొక్క విలువ

గీత యొక్క విలువను తెలుసుకొనవలెనన్న మొదట గీతపై పూజ్యభావము కలుగవలెను. గీతకు బహిరంగ పరీక్షణముబాహ్యనిరీక్షణము అత్యవసరము. తలపై నుంచుకొవలసినది గ్రంధముకాదు. అందులోని భావములనుపూజగ్రంధమునకు కాదుఅందలి విషయమునకు పీఠములపై పెట్టుటకాదుహృదయపీఠమున ప్రతిష్టింపవలెను. అట్లు చేసిననే గీత యొక్క సత్యము నిత్యమునిర్మలమై నిలుచును.

 

 ఆకొన్నవాని ఆకలి తీరునా

 పంచభక్ష్యముల పాకమువిన్న?

 నిరు పేదవాని పేదరికంబు పోవునా

 విత్త ప్రభావంబు విన్నయంత

రోగపీడుతు వా ని రోగము తిరునా

 ఔషధ మహిమంబు అంత విన్న?

 భవరోగ నివారణ కావాలంటేభగవంతుడు మన మనస్సులో నిలిచిపోవాలి. మన రక్తములో కలిసిపోవాలి. సర్వత్రా ఉన్న ఈశ్వరతత్వాన్ని హృదయస్థానమున అభివృద్ధి పరచుకొని అంతర్ దృష్టి ద్వారా దర్శించుకోవడానికి ప్రయత్నించాలి.

 

హృదయము లేని మాటల కంటేమాటలు లేని హృదయములుగా మనము తయారు కావాలి. మానవుడు ఈనాడు అభివృద్ధి పరచుకోవలసింది మాటలు లేని హృదయము. ప్రేమ స్వరూపులారా! మనము వేదఇతిహాసపురాణములను పఠించవచ్చు. భగవద్గీతను పారాయణము చేయవచ్చును. ఇవి పవిత్రకర్మలే! కానిమన నిత్యజీవితములో అనుభవించవలసిన అనుభూతులుచేయవలసిన పనులు. కర్తవ్యములు సక్రమమైనటు వంటివిగా ఉండాలి. మన ప్రవర్తన సక్రమముగా లేకుండాఎన్ని భగవద్గీతలు చదివినాఎన్ని ఉపనిషత్తులు పఠించినా మనకు వచ్చిన ఫలితమే మాత్రము ఉండదు.

 కాషాయ వస్త్రము కట్టిన మాత్రాన

 కరతలామలకంబు కాదు భక్తి

నోటిలో మంత్రంబునుచ్చరించిన లోన

 చేసిన పాపంబు చెదిరిపోదు.

గీతల చేబట్టి కేకలు వేసిన

 పుణ్యంబు మన ఇంట ప్రోగుపడదు

 చెప్పు మాటలకు చేసెడి చేతలకున్

 సామ్యముండెడి వాడే సాధువగున్

మనలో ఉట్టినటువంటిద్వేష అసూయాదులనే కంపునుండిమననుండి ఎప్పుడు విడదీస్తామోఅదే నిజమైన భక్తి ప్రవీణత లక్షణము. కావున గీతా ప్రచారకులు గానిగీతాపారాయణులు గాని బాహ్యడంబరములకు పోకవిషయమునకు హృదయ స్థానిమిచ్చిఆచరణ యందనుభవించుకొనిఆనందము పొందుట ధర్మము.

(శ్రీ.భ.ఉ.పు.37/38)

(చూ||ఓర్పుభగవద్గీత)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage