ధర్మసూత్రములు సనాతనములనబడును. కారణమేమనగా అవి యేనాడు పుట్టినవో యెవ్వరు నెరుగరు. మరియు వాటికి కర్తయెవరో గుర్తించినవారు లేరు. పక్షపాత రహితులును, పరిశుద్ధ బుద్ధులును నయిన ఋషులు ఆ సూత్రములను జ్ఞాన దృష్టిచేత దర్శించి లోక కళ్యాణము కొరకు ప్రకాశితములు కావించినారు. అవి ప్రపంచ ప్రవృత్తికి మూలాధారములు. మరియు శాశ్వతములు. అవి తాత్కాలికావేశములకు ప్రాధాన్యమియ్యవు.
(స.వ. పు. 1)