"న యక్షంతి, న హోష్యంతి, హేతువాద విమోహితా:
నీచకర్మ కరిష్యంతి, హేతువాద విమోహి తా: “
అనగా, హేతువాదము లాశ్రయించిన వారు దేవతా రూపములను పూజించరు. అగ్నులందు హోమము చేయరు. నీచకార్యాచరణలందు ప్రవేశింతురు. అని మహాభారతమున అరణ్య పర్వమునందు, కవి వర్ణనలో చెప్పబడెను.
వేయేటికి? ధర్మాచారమువల్లనే సూర్యచంద్రాదులు తమ గతులు, తప్పకుండ, సంచరించుచున్నారు. సమస్త దేవతలు తమ విధులు నిర్వహించుచున్నారు. పంచభూతములు ధర్మాధారంగానే వెలయుచున్నవి. ధర్మమునుండి తాను ప్రమాదమును పొందక, ఇతరులను, ప్రమాదములకు గురిచేయక, ఉండవలెను. ధర్మధ్వజ కాంతి యావత్ ప్రపంచమంతట కళను చిమ్మవలెను. తర్కములకు చోటివ్వక, బుఱ్ఱలను పాడు చేసుకొనక, యథార్థ ఆత్మతత్త్వమును విశ్వసించి, దాని మూలమున, ఆధారమున, ఆచార ధర్మములను అనుష్టానము నందు, నిత్య కృత్యములతో లీనమొనర్చి, ఆనందమును అనుభవించుట అత్యవసరము.
(ధ. వా. పు. 47)
(చూ|| ధర్మస్థాపన, సమానులే)