నీవు ఎంత గొప్పవాడవైనప్పటికిని. ప్రైమినిస్టరువే అయినప్పటికిని నీ తల్లికి నీవు కుమారుడవే. కనుక మొట్టమొదట నీవు తల్లిని గౌరవించాలి, తండ్రిని గౌరవించాలి. తల్లితండ్రులనే గౌరవించలేని వ్యక్తిని లోకము ఏమాత్రము గౌరవించదు. ఎవరికి వారు మౌనంగా కూర్చొని విచారణ చెయ్యాలి. నీ బ్లడ్, నీ ఫుడ్, నీ హెడ్, నీ దుడ్డు అంతా పేరెంట్స్ గిప్ట్. ముందుగా పేరెంట్స్ కు గ్రాటిట్యూడ్ యివ్వాలి. ఈ నాటి అనేకమంది విద్యార్థులు పేరెంట్స్ కు గ్రాటిట్యూడ్ యివ్వటం లేదు. తల్లితండ్రులను ఫ్రెండ్స్ మాదిరి చూస్తున్నారు. ఇలాంటి దానిని తల్లి తండ్రులు అంగీకరించకూడదు కారణము ఏమంటే తల్లితండ్రులు ఆ పిల్లవాని భవిష్యత్ జీవితము పాడుచేస్తున్నారు.
(ఉ.బృపు, 12)||