గాలి అన్ని ప్రదేశములకు వెడుతున్నది. ఏ దుర్గంధమును ఏసుగంధములను ఏ మాత్రము తాను స్వీకరించటం లేదు. సర్వ ప్రాణులకు ఉచ్చ్వాస నిశ్వాసములందిస్తున్నది. కానీ దేనితోను సంబంధము లేదు. అన్నింటి యందు ఉన్నాను. అందరిలోను ఉన్నాను. కానీ నాలో ఏమీ లేదు. ఇది గొప్ప బోధ. అందరి యందు ఉంటున్నాడు భగవంతుడు. కాని భగవంతునిలో ఏమీ లేదు. అదే నిరుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ద బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణీం" అని ప్రబోధించింది. వేదము. .
(ద. య. స. పు. 64)
(చూ॥ మానుషాకారము)