"శారీరకముగానూ మేధస్సులో గాని ఏమాత్రమూ శ్రమించక ఈ విధముగా డబ్బు పెట్టి లక్కీ ప్రైజ్’ ను గెలుచుట గాంబ్లింగ్ (Gambling) జూదము, ఇది స్వామికి ఏమాత్రమూ సమ్మతము కానేకాదు. (పుష్పగిరిలో స్కౌట్సు సేవ చేయుచుండిన సంతకు పోయే దారిలో సత్యాకు ఒక బీడి కట్ట, ఒక అణా దొరకినవి. ఆ అణా నాణెమును మాత్రమే తీసుకొన్న సత్యా, దానిని పందెము కాసి, కాయ్ రాజా కాయ్ ఆటలో కాంపు ఖర్చులకు అవసరమైన డబ్బును గెలుచుకొనెను). సందర్భవశాత్తు పరిస్థితుల ప్రాబల్యము చేత స్వామి ఈ విధముగా చేయవలసి వచ్చింది. కానీ ఈ కారణము చేత మీరెవరూ దానిని అనుకరించరాదు."
(లీ.నా.సా. పు. 42)