సకల పురుషార్థములకూ ధర్మమే మూలము, ధర్మము సత్యము మీదనే నలిచి యున్నది. సత్యములేక ధర్మము నిలువజాలదు, సత్యధర్మములు రెండునూ అవినాభావ సంబంధము కలవి. పితృవాక్య పరిపాలనచే నాకు ఇప్పుడు సత్యధర్మములు రెండు సమకూరుతున్నది. తల్లికి కాని తండ్రికి కానీ పెద్దలయిన గురువులకు కానీ మాట యిచ్చిన తరువాత ధార్మికుడైనవాడు ఎవడునూ తప్పడు, తప్పకూడదు. అందువలన పితృ ఆజ్ఞను నేను అతిక్రమించను. నన్ను ఆజ్ఞాపించినది కైకేయి కాదు, పిత్రాజ్ఞను ఆమె నాకు అందించింది. అట్లు అందించుట అతని సన్నిధి యందే కనకదానిని శిరసావహించవలెను.
(రా.ర. వా. మొ. పు. 222/223)