క్షేత్రమనగా నేమియో యోచించితివా? దుఃఖమని, దాని నుండి ప్రజాకోటిని రక్షించే వానినే క్షత్రియుడని అందురు. - ఇట్టి ధర్మ యుద్ధము యెట్టి పుణ్యాత్ములకో లభించును. కానీ అది సామాన్యము కాదు! అందులోనా, క్షత్రియునికే ఈ పుణ్యము దొరికినది. ధర్మపరులను కాపాడుటలో, అధర్మపరులను హతమార్చుటలో యెంతటి ఉపకారమైన పుణ్యము కలదో యోచించుకో! లోకములో శాంతి సౌఖ్యాన్ని నెలకొలుపుటకు చేయు యుద్ధమునే ధర్మ యుద్ధమని అందురు.
(గీ. పు. 33)