"ఆయన అనుగ్రహాన్ని నమ్ముకుంటే ఈ క్షణం నుండే నీవు రోగవిముక్తుడ వవుతావని నిశ్చయింకో, ఔషధాలమీద నీకున్న విశ్వాసాన్ని దైవం మీదకు మరలించు. ఔషధాల పైన నమ్మకం పెట్టుకోవద్దు. మాధవుని మీద పెట్టుకో. ప్రార్థన, జపం, ధ్యానాలను అనుసరించు. అవి నీకు అవసరమైన విటమినులు. ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. రామనామమంత ప్రయోజనకరమైన మందుగుళిక ఏదీ లేదు. నేను నీకు విభూతి ఇస్తాను. అది నిన్ను స్వస్థపరుస్తుంది. ఔషధాల మీద, వైద్యుల మీద నమ్మకం ఉండే వాళ్ళకోసం ఆస్పత్రులు. కాని, దైవానుగ్రహం లేకపోతే ఔషదాలు ఏం చేయగలుగుతాయి? వైద్యులేం చేయ గలుగుతారు? శాంతి సంతోషాలకు సాధనమార్గాన్ని, ఆనందమార్గాన్ని అంగీకరించడం వల్ల అందరూ ఆరోగ్యంగా ఏరోగం లేకుండా ఉండడం చేత అసలు ఆస్పత్రులే అవసరం లేని రోజు తప్పకుండా వస్తుంది."
(లోపు.107)