రాధ తత్వము కూడా అగాధమైనది. అతి గూఢమైనది. ఆమె నిరంతరమును కృష్ణధ్యానములో నిమగ్నమై యుండెడిది. ఆమె కూడా బాలకృష్ణుని భగవదవతారముగనే భావించినది గాని, మానవమాత్రునిగా చూడలేదు. కృష్ణు డొకనాడింటినుండి తప్పించుకొనిపోయినాడు. యశోద యెంత వెదకినను. -ఎక్కడను కనబడలేదు. చివరకు రాధయింటికి వెళ్ళి ఆ విషయ యామెకు చెప్పినది. ఆమె కొంచెము సేపు కనులు మూసుకొని ధ్యానముచేసి, “కృష్ణా!" అని పిల్చినది. పిలుపు వెంటనే కృష్ణుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు యశోద, ఆనందబాష్పములతో “రాధా! నేను కృష్ణుని తల్లిభావనతో ప్రేమించుచున్నాను. నా ప్రేమలో, కృష్ణుడు నా కుమారుడు; నే నతనికి రక్షకురాలను అన్న యహంభాన మున్నది . నీది యహంభాన పేరణలేని పవిత్ర ప్రేమ” యన్నది. (శ్రీ సత్య సాయి వచనా మృ తము 1964 పు 42)