నాగ, కూర్మ కృకర, దేవదత్త, ధనంజయాలని ఉప ప్రాణముల పేర్లు కలవు.
నాగవాయువు త్రేపులను కలిగించును, కూర్మవాయువు వలన రెప్పపాటు సంభవించును, కృకర వాయువువలన తుమ్ములు వచ్చును. దేవదత్త వాయువువలన ఆవులింతలు కలుగును, ధనంజయ వాయువు శరీరమంతటినుండి దేహమును స్థూలముగా చేయును. ఇంతేకాదు దేహము మరణించిన తర్వాత కూడా దేహములో నిల్చియుండి కళేబరాన్ని వుబికించును. ఇట్లు పంచప్రాణములు, ఉపప్రాణములు కలసి ప్రాణమయకోశ మనబడును.
(ప్ర. శో.వా. పు 28)