యజ్ అనే ధాతువు నుండి పుట్టినది. దీనికి అనేక అర్థములున్నవి. ప్రధానముగా దేవపూజ అనియు దాన ధర్మాదులనియు అర్థము. యజ్ఞయాగాది క్రియాకలాపాన్ని వివరించే వేదం యజుర్వేదము. దీనినే అధర్వవేదమని కూడా చెప్పుదురు.
దీనికి రెండు సంప్రదాయములు కలవు. ఆదిత్య సంప్రదాయమనియు, రెండవి బ్రహ్మసంప్రదాయ మనియు, బ్రహ్మసంప్రదాయమే కృష్ణయజుర్వేదమనియు, ఆదిత్య సంప్రదాయమే శుక్ల యజుర్వేదమనియు అందురు. శుక్ల యజుర్వేదము ఉత్తర భారతములోను, కృష్ణ యజుర్వేదము దక్షిణ భారతము లోను ప్రసిద్ధము. ఇది ఋక్ సంహితము దగ్గరగా ఉంటుంది. దేవ పూజకు హవిస్సులు సమర్పించుటే ఈ మంత్రముల యొక్క ఉపయోగము. ఈ కృష్ణయజర్వేదము నకు 86 ప్రధాన శాఖలు మాత్రమే. ఉన్న కొన్ని శాఖలే ఇంత మహత్తరమైనపై ఉండగా అన్ని శాఖలు ఉండి ఉండిన దీని విశిష్టత వర్ణనాతీతము. వేదము ఘనతను వర్ణింపనెవరి తరముకాదు. ఇది అవాజ్ఞ్మాసనగోచరం. యతోవాచ ని వర్తంతే అప్రాప్యమనసాసహ’ఈ సత్యాన్ని గుర్తించినవాడు ధన్యుడు. వాడే పూజ్యాడు. పురుషార్ధమును సార్ధకము గావించుకొన్నాడు.
(లీ.వాపు 12/13)
(చూ: ఈశావాశ్యము. సోషలిజము)