అనేక మంది సైంటిస్టులు జగద్వాపకమైన మారణ యంత్రములను కనిపెడుతూ వస్తున్నారు. కాని, ఇన్ని యంత్రములను కనిపెట్టిన యంత్రమును ఈనాడు సైంటిస్టులు గుర్తించడం లేదు. భూమి చుట్టూ ప్రదక్షిణ చేసే గ్రహాలను సృష్టిస్తున్నారు. చంద్రునికి పైకి పోయే వాటిని కూడా సృష్టిస్తున్నారు. సోలార్ పవర్ లో ఎంతో చేస్తున్నారు. కాని, ఈ అన్ని యంత్రములను సృష్టించిన గొప్ప యంత్రము ఒకటి ఉంటున్నది. ఏమిటా
యంత్రము? మానవదేహమే! ఇట్టి యంత్రము యొక్క రహస్యాన్ని గుర్తించడానికి ఎవ్వరూ ప్రయత్నించడంలేదు. బయటి యంత్రాలను చక్కగా పరిశీలన చేస్తున్నారు. లేబొరేటరీకి పోతున్నారు. పరిశోధనలు జరుపుతున్నారు. కాని, What about your self? నిన్ను నీవు పరీక్షించుకోవాలి, పరిశోధన చేసుకోవాలి. నీలోని శక్తియే జగత్తంతా వ్యాపించి యున్నది. జగత్తునందున్న శక్తియేనీ యందు ఉన్నది. ప్రపంచమంతా Reflection of the inner being. నీ కంటే గొప్పవాడు ఈ లోకంలో లేడు.అన్ని శక్తులూ నీలోనే ఉంటున్నాయి. ఆకర్షణ శక్తి, - విద్యుత్ శక్తి, కాంతిశక్తి, అగ్ని శక్తి అన్నీ నీలోనే ఉంటున్నాయి. X-Ray Power కూడా నీలోనే ఉంటున్నది. ప్రతి వ్యక్తి ఒక చిన్న కంప్యూటరు. ప్రతి వ్యక్తి ఒక చిన్న జనరేటరు. ప్రతి వ్యక్తి ఒక కాంతి జ్యోతి.
వైజ్ఞానికులు ఉన్న దానినే వినియోగిస్తున్నారు. కాని, లేని దానిని సృష్టించి వినియోగించటం లేదు. భూమికి ఆకర్షణ శక్తి ఉంటున్నది. ఇది దీని సహజాశక్తియే. కాని, న్యూటన్ పరిశోధన చేసి దీనిని కనిపెట్టాడు. ఇక్కడ వైజ్ఞానికులుయొక్క అజ్ఞానం ఎంతవరకు పనిచేస్తున్నదనేది మీరు గమనించాలి. సహజంగానే ఉన్నదానిని కేవలం - పరిశోధనలు చేసి ఉన్నది ఉన్నట్లుగా చెప్పిన వైజ్ఞానికునిపేరు ప్రపంచ వ్యాప్తి ఆయిపోయింది. కాని, అందరూ ఉన్నదాని సంగతి మరచిపోతున్నారు. ఉన్నది. అనగాఅదే సత్. ఆ సత్మ పరిశోధన చేసి "అది ఉన్నది " అని చెప్పిన వాని పేరు సార్ధకమైపోయింది. కాని, అసలు ఉన్నదాని వ్యాప్తి ఏమాత్రం కాలేదు. అదియే దివ్యమైన శక్తి. అలాంటి శక్తియే సూర్య చంద్రాదులయందు, నక్షత్రముల యందు, భూమి యందు, ప్రతి వ్యక్తి యందు - సర్వత్రా వ్యాపించి యున్నది.
(శ్రీభ.ఉపు.143/144)