ఉపదేశమనగా - "ఓం నమశ్శివాయ. ఓం నమో నారాయణాయ" అనే పంచాక్షరి కాని, అష్టాక్షరి కాని ఉపదేశించడం కాదు. ఉపదేశమునకు రెండు అర్థములుంటున్నది. ఒక వ్యక్తిని స్వస్థానమునకు చేర్చడమే ఉపదేశము. రెండవ అర్ధమేమనగా నేను ఆత్మకు భిన్నంగా ఉన్నాను.” అనే భావంతో కూడిన వానిని "నాయనా! ఆత్మనీ కంటె భిన్నము కాదు. నీవే ఆత్మ!" అని అతనికి స్వస్వరూప సందర్శనమును నిరూపించడమే ఉపదేశము.
(శ్రీ భ. ఉ. పు.170)