ఉపకారికిఉపకారము
విపరీతముకాదు సేయ వివరింపంగా
అపకారికి ఉపకారము
నెపమెన్నక సేయువాడే నేర్పరి సుమతీ!"
ఎవరు మనకు అపకారం చేశారో, వారికి కూడా ఉపకారం చేయాలి. ఈ విషయంలో నా ప్రతిజ్ఞ ఒకటే. ఎవరు నాకు అపకారం చేసినప్పటికినీ, ఎవరు నన్ను దూషించినప్పటికినివారిని నేను ఆనందంగా చూస్తాము. My life is My message. ఎవరు ఈనాడు ఈ విధంగా నడచు కుంటున్నారు? ఎవ్వరూ నడచుకోవటం లేదు. వారు నడచుకోవటం లేదని నేను ఏ మాత్రం బాధపడను. నడచుకున్నవారు బాగుపడుతారు. నడచుకోనివారు అవస్థలకు గురి అవుతారు. నా అడుగు జాడలలో నడవండి! మీకు ఎట్టి ఆపకారం జరగదు. లక్షలాది మంది పిల్లలకు ఉచిత విద్య నిస్తున్నాను. పిహెచ్.డి.లు చేస్తున్నారు. ఈనాడు ఒక కాన్వెంట్లో చేరాలంటే వేలాది రూపాయిలు ఖర్చు చేయవలసి వస్తున్నది. అలాంటి పరిస్థితులలో పిల్లలందరికీ ఉచిత విద్యను అందిస్తున్నాను. ఈ గుణాలన్ని తల్లి ఈశ్వరాంబనుండే నేర్చుకున్నాను. చిన్న నాట భర్తలను కోల్పోయిన అభాగ్యులను దగ్గరకు చేర్చి ఓదార్చేది. వారిలో విశ్వాసాన్ని పెంపొందించేది. మనం కూడా ఆ విధంగా కృషి చేయాలి. ముఖ్యంగా మనం ఈనాడు కృతజ్ఞతను పెంచుకోవాలి. కృతఘ్నులు కాకూడదు. మనకు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేయాలి. చేతనైనంత సహాయం చేయాలి. అపకారం చేసినవారికి కూడా ఉపకారం చేయాలి. వీడు మనవాడా! ఇతరుడా! అని చూడకండి. బాధపడేవారిని చూస్తే, తక్షణమే సహాయం చేయండి. ఇదే నిజమైన చదువు. ఇతరులకు సహాయపడని చదువు వుండి ప్రయోజనం ఏమిటి?
(శ్రీజూ, 2002 పు.9/10)
(చూ||దైవస్వరూపులు,నా ప్రతిజ్ఞ)