ఉత్తమపుత్రుడున్నప్పుడు తన కుటుంబమే కాక, వంశమునకు కూడా చక్కని గౌరవమర్యాదలు చేర్చుకుంటాడు. ఒక పరిమళ వృక్షము వనమున ఉన్నప్పుడు వనమున కంతటికి పరిమళాన్ని అందిస్తూ ఉంటుంది. అదే వనమునందు ఒక చెట్టు తొట్టులో అగ్ని ప్రవేశించినప్పుడు ఆ చెట్టును కాల్చడమే కాకుండా వనమును కూడా కాల్చి వేస్తుంది. కనుక వంశమునందు దుష్ట పుత్రుడు పుట్టినపుడు మంచి వారికి, చెడ్డవారికి అపకీర్తి కలిగిస్తాడు. మంచి పుత్రుడు జన్మించినపుడు తన వంశమునకు, తన గృహమునకు, తనతోటి వారికి కూడా సత్కీర్తి నందిస్తాడు. ఈనాడు గుణవంతుడైన పుత్రుని కనటము, పోషించటము జగత్తునకు అందించటము అత్యవసరము. ఇది ఎవరి బాధ్యత? తల్లి తండ్రులది, అధ్యాపకులది కూడా.
(స.సా.ఆ. 89 వెనుక కపురు పుట)