ఉగాది-ప్రకృతి సంబంధమైనది
దైవత్వము మానవుల యందలి సర్వాంగముల (యందు రసస్వరూపమైన్నది.అందుచేతనే - “రసోవైసః” అని అన్నారు. ఈనాడు ఉగాది పర్వదినం. "యుగములకు ఆది - ఈ ఉగాది”. ఋతువులలో మొదటిది - వసంతఋతువు, మాసములలో మొదటిది -చైత్రమాసము, పక్షములలో మొదటిది - శుక్లపక్షము. తిథులలో మొదటిది - పాడ్యమి. ఈనాడు ఋతువు, మాసము, పక్షము, తిథి - ఇవన్నీ ప్రధానమైనవిగా చేరియుండుట చేత ఇది - "ఉగాది" - అని పిలువబడుతున్నది. ఈ కలియుగానికి ఆది యైనవన్నీ ఈనాడు కలసి యుండుట చేతనే దీనిని “ఉగాది” అన్నారు. -
ఈలాంటి ఉగాది పర్వదినాలు ఎన్నో జరిగిపోతున్నాయి. ఆ ఎన్నో ఉగాదులను ప్రజలు చేసికున్నారు, కానీ, ఈ ఉగాదితత్వం వలన వారిలో ఎంతవరకు మార్పు వచ్చింది? ఈనాడు మంచి గుడ్డలు - ధరిస్తున్నారే గానీ మంచి గుణాలను అభివృద్ధి గావించుకొనుట లేదు. గుడ్డలు మారితే ప్రయోజనం లేదు, గుణములు మారాలి. బట్టలు మారితే ప్రయోజనం లేదు, బుద్ధులు మారాలి బుద్ధులు మార్చుకోకుండా ఎన్ని రకాలైన పర్వదినాలను జరుపుకొన్నప్పటికీ జనం లేదు.
భారతీయులు అవతారపురుషుల జన్మదినములను, మత స్థాపకుల జన్మదినములను, దుష్టులు - మరణించిన దినములను పర్వదినములుగా జరుపుకొంటున్నారు. కానీ, ఈ ఉగాది ఏ అవతారపురుషుల "జన్మదినమునకుగానీ, ఏ దుష్టుల మరణ దినమునకుగానీ సంబంధించినది కాదు, ఇది ప్రకృతికి సంబంధించినది. అందరికీ ఇది అత్యవసరమైనటువంటిది. ప్రకృతితత్త్యమును గుర్తించడానికి ఇదే చక్కని ఆదర్శము. మనకు ప్రకృతియే ప్రత్యక్షదైవము.
( శ్రీ.వా. మా – 2020పు 7)
ఎంతవరకు మార్పు వచ్చింది? ఈనాడు మంచి గుడ్డలు - ధరిస్తున్నారే గానీ మంచి గుణాలను అభివృద్ధి గావించుకొనుట లేదు. గుడ్డలు మారితే ప్రయోజనం లేదు, గుణములు మారాలి. బట్టలు మారితే ప్రయోజనం లేదు, బుద్ధులు మారాలి బుద్ధులు మార్చుకోకుండా ఎన్ని రకాలైన పర్వదినాలను జరుపుకొన్నప్పటికీ ప్రయోజనం లేదు. భారతీయులు
అవతారపురుషుల |జన్మదినములను, మత స్థాపకుల జన్మదినములను, దుష్టులు - మరణించిన దినములను పర్వదినములుగా జరుపుకొంటున్నారు. కానీ, ఈ ఉగాది ఏ అవతారపురుషుల "జన్మదినమునకుగానీ, ఏ దుష్టుల మరణ దినమునకుగానీ సంబంధించినది కాదు, ఇది ప్రకృతికి సంబంధించినది. అందరికీ ఇది అత్యవసరమైనటువంటిది. ప్రకృతితత్త్యమును గుర్తించడానికి ఇదే చక్కని ఆదర్శము. మనకు ప్రకృతియే ప్రత్యక్షదైవము.
(శ్రీవాణి మార్చి – 2020పు7)
(చూ|| నాల్గుయుగాలు)