అనాది కాలము నుండియు భారతీయులు లోకా స్సమస్తా సుఖినోభవంతు . ప్రపంచములోని ప్రతి ఒక్కరూ సుఖముగా నుండవలెను. అని ప్రార్థించుచుండిరి. అందువలననే భారతదేశము సమస్త మానవ కోటికి తలమానికముగా, గురుతుల్యముగా నుండెడిది. అందువలననే అనేక విదేశ సంస్కృతి ప్రభావముల ఒత్తిడికి నిలబడగలిగి తన పూర్వ ప్రాదుర్భావమును తిరిగి పొందగల స్థితిలో వున్నది. ప్రపంచమందలి అన్ని కోణములకు శాంతి సందేశము నందించి, ఒక పెద్ద ప్రశాంతి నిలయముగా విరాజిల్లగల అన్ని హంగులూ, భారతదేశము కలిగియున్నది. తప్పక ఆ విధముగా నుండగలదు.
(శ్రీస.సూ.పు.82)
(చూ: లింగము)