భూలోకము: (అది మానవుని పాదముల యందును) భువర్లోకము: (ఇది గుహ్యమందును) సువర్లోకము; (ఇది నాభియందును) మహర్లోకము: (ఇది హృదయమందును) జనలోకము: (ఇది కంఠమునందును) తపోలోకము; (ఇది భ్రూమధ్యమందును) సత్యలోకము; (ఇది లలాట మందును) కలవు. ఈ సప్తలోకములు మానవుని అంగములందే వున్నవి. వీటిని ఊర్ధ్వలోకములని అందురు. ఇంకను అథోలోకములు కూడా కలవు. - అతలము (ఇది అరికాళ్ళయందును) వితలము (గ్రోళ్ళయందును) సుతలము (మడిమలయందును) తలా తలము (పిక్కలయందును) రసాతలము (కాళ్ళయందును) మహతలము (తొడలయందును) పాతాళము ప్రాయువునందును వుండును.
లోకములన్నింటికి దేహమే నిలయమయినప్పుడు సముద్రములు లోకములతోనే కాక ప్రత్యేకించి యెటులుండును? అన్నియును ఈ దేహముతోటి మిళితమై వున్నవి. 1. లవణ సముద్రము 2. ఇక్షు సముద్రము 3. సురా సముద్రము 4. సర్పిసముద్రము 5. దధిసముద్రము 6. క్షీరసముద్రము 7. శుద్థోదక సముద్రము అని యేడు సముద్రములు కలవు. అవి లవణ సముద్రము మూత్రము గాను ఇక్షు చెమటగాను, సుర ఇంద్రియముగాను సర్పి దోషితముగాను, దధి శ్లేషముగాను, క్షీరము జొల్లుగాను, శుద్థోదకము కన్నీరుగాను వున్నవి.
(ప్ర. శో.వా.పు.6/7)
(చూ॥ శిరస్సు)