భగవంతుడు రూప రహితుడు అతనిని మనం చేరాలనుకుంటే మనం కూడా రూపరహితులం కావాలి. రూపరహితమైన ఈశ్వర తత్వానికి లింగము గుర్తు. లింగము అనే పదానికి గురుతుఅనేదే అర్థం. లింగము లయానికి గుర్తు. ప్రపంచమంతా లింగంలో లీనమవుతుంది. ఇంద్రియములు, యింద్రియ విషయములు, మనస్సు కూడా లయము కావలెను. ఊహలు, భావాలు, మనోవికారములు, చిత్తవృత్తులు ఆ ఈశ్వరతత్వ చిహ్నమున ధ్యానములో లీనము కావలెను. కనుక మనము జీవనజ్యోతిగా భావించి - జ్యోతిని ఏకాగ్రతగా నుంచుకొని, తద్వారా ధ్యానము సల్పి దైవత్వములో లీనము కావాలి.
(సు. పు. 95)
"విశ్వవ్యాప్తమైన బ్రహ్మాండము, వ్యక్తిగతమైన పిండాండము - ఈ రెండు ఒకే పరబ్రహ్మ తత్త్వము నుండిఉద్భవించుచున్నవి. అణువులో అణువుగా బ్రహ్మాండములో బ్రహ్మాండముగా, సృష్టిలోని ప్రతిజీవిలోను సాక్షీభూతముగా ఉండే ఆత్మతత్త్యము బ్రహ్మ తత్త్వములో లీనమగు చున్నది. అటులనే బ్రహ్మతత్త్వము కూడా ఆత్మతత్త్వములో లీనమగు చున్నది."
(దై.మ.పు.170)
నల్లటి పెద్ద తుమ్మెదను మీరు చూచియుందురు. కదా? అది కఠినమైన కర్రలో కూడా రంధ్రములు వేయును. కర్ణుని తొడను ప్రవేశించే శక్తి గలిగినది. అయితే వికసించిన కమలమునందు ప్రవేశించి మకరందమును త్రాగిన తరువాత ముకుళించిన ఆ కమలము లేత రేకులను చీల్చుకొని తుమ్మెద బయటకు రాలేకపోవుచున్నది. అట్లాగే భగవంతుని పాదపద్మములందున్న మకరందమునుగ్రోలి, ఆశక్తి వలన ఉన్మత్తులై ఆ ఆనందములోనే లీనమై పోదురు.
దుర్భావము దుశ్చింత దుర్బోధలు లేని జీవితమే పరిపూర్ణ జీవితము. నెరవేరవలసినది, నీ అభిష్టమా? పరమాత్ముని అభీష్టమా? అని విచారణ సలుపవలెను. నెరవేరునవన్ని పరమాత్ముని సంకల్పములే. అని తెలియవలెను. తాము దైవస్థానమునకు పయనించి చేరవలెను. కాని తనస్థానమునకు దైవమునులాగకూడదు:
(త.శ.మ.పు.92/93)
(చూ: ఆనందము)