మనస్సు అనే వెండిని కరిగించి మాధవుడనే రూపముగా పోతపాయ్యాలి. ఈ దేహము వేరు - దైవము వేరు, కానేరదు. ఇదే ధ్యానము యొక్క సాఫల్యత. మానవత్వములో లీనమై పోవాలి.
(స. సా.జ.76పు.260)
"ముత్యాలు సంపాదించడానికి నీవు సముద్రంలోపలికి పోవాలి. ఒడ్డున కెరటాల మధ్య ఆడుకొంటూ కూర్చొని సముద్రంలో ముత్యాలు లేవు. వాటిని గూర్చి చెప్పిన కథలన్నీ అబద్ధం - ఆవి ప్రమాణం చేసి చెప్పడం మంచిదా? అట్లే ఈ అవతారం యొక్క పూర్తి ప్రయోజనాన్ని మీరు పొందాలంటే లోతుకు పోయి సాయిబాబాలో లీనమైపోవాలి."
(లోపు.12)
(చూ॥ గానము)